/rtv/media/media_files/2025/09/11/father-kills-daughter-2025-09-11-12-21-46.jpg)
Father kills daughter
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా(ntr-district) మైలవరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదు రోజుల క్రితం బాలిక మిస్సింగ్ పై బందువుల ఫిర్యాదు తో రంగంలోకి దిగిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. మైనర్ బాలికను రాడ్డుతో తండ్రి కొట్టి చంపినట్లు(Father Killed His Daughter) తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తు తో నిజాలు బయటపడుతున్నాయి. మైలవరం శుద్దిపేట ప్రాంతంలో నివాసముంటున్న చిందే బాజీకి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య ద్వారా 5గురు ఆడపిల్లలు, రెండవ భార్య ద్వారా ఒక ఆడపిల్ల జన్మించినట్లు తెలుస్తోంది. రెండవ భార్య తో వివాహం తర్వాత బాజీ నుండి విడిపోయిన మొదటిభార్య విడిగా బతుకుతోంది. కాగా ఆమెకు చెందిన 5గురు ఆడపిల్లలు బాజీతోనే ఉంటున్నారు. రెండో భార్యకు పుట్టిన ఒక కుమార్తె కూడా వారితోనే ఉంటుంది.
Also Read:'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!
Father Killed His Daughter
భాజీ రెండవ భార్యతో కలిసి గంజాయి విక్రయాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు బాజీతో పాటు ఆయన భార్యను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇటీవల భార్య జైల్లోనే ఉండగా బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే రెండవ భార్య కుమార్తె ఒక యువకుడితో ప్రేమలో పడిందని గమనించి బాజీ హెచ్చరించాడు. కుమార్తె వినకపోవడంతో ఇంట్లోనే తన ఐదుగురు కుమార్తెల సమక్షంలోనే గాయత్రి పై ఐరన్ రాడ్ తో దాడికి పాల్పడ్డాడు బాజీ. దీంతో ఆమె అక్కడక్కడే మరణించింది.రెండవ భార్య కుమార్తె మరణించడంతో నెత్తుటి మరకలు పోవడానికి గదిని బ్లీచింగ్ తో శుభ్రం చేశారు మిగిలిన కుమార్తెలు.5రోజులుగా బాలిక కనిపించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తుతో నిజాలు బయటపడ్డాయి. అయితే చనిపోయిన బాలికను ఏం చేశాడన్నది మిస్టరీగా మారింది. హత్య విషయం బయటకు పొక్కడంతో బాజీ కూడా పరారయ్యాడు. మృతి చెందిన బాలికతో పాటు, బాజీ ఆచూకి కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి:KTR కు ఏసీబీ బిగ్ షాక్..ఫార్ములా ఈ కార్ రేసులో అరెస్ట్ ?