ఆంధ్రప్రదేశ్ ప్రాణాలకు తెగించిన యువకుడు.. తండ్రి, కూతురిని ఎలా కాపాడాడంటే? పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. అది గమనించిన సాయిబాబు అనే యువకుడు కాలువలోకి దూకాడు. ఆపై కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న తండ్రి కూతురిని రక్షించాడు. సాయిబాబు సాహసాన్ని స్థానికులు ప్రశంసించారు. By Seetha Ram 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అదుపు తప్పిన కారు.. అందులో ఏముందో చూసి షాకైన పోలీసులు! అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధి వద్ద శుక్రవారం భారీఎత్తున గంజాయి పట్టుబడింది. ఓ కారు 583 కేజీల గంజాయితో అదుపుతప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.27 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. By Seetha Ram 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై అసభ్యకర ట్వీట్ పెట్టిన వ్యక్తిపై కేసు సీఎం చంద్రబాబుపై అసభ్యకర ట్వీట్ పెట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. సీఎం పట్టువస్త్రాలు తలపై పెట్టుకొని ఉన్న షార్ట్ వీడియోని అప్లోడ్ చేసి "దేవుడికి ఇష్టంలేదని స్పష్టంగా కనిపిస్తుంది, మళ్ళీ చెప్తున్నా ప్రాణగండం ఉంది" అంటూ చైతన్య చేయడంతో అరెస్ట్ చేశారు. By V.J Reddy 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ దసరా వేళ తప్పిన భారీ ప్రమాదం! తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం NH-16పై బస్సును 10 మంది భవాని భక్తులతో వెళ్తున్న కారు ఢీకొట్టింది. కార్ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా కారులో ఉన్న భక్తులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. By V.J Reddy 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం AP: వివిధ రంగాలకు సంబంధించిన కొత్త విధానాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నూతన ఇసుక పాలసీ, మద్యం విధానాలను ప్రకటించిన ప్రభుత్వం మరో 22 కొత్త పాలసీలను త్వరలోతీసుకొచ్చేలా కార్యాచరణ చేపట్టింది. By V.J Reddy 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు బ్రహ్మోత్సవాలు కావడంతో స్వామివారికి ఘనంగా చక్రస్నానం నిర్వహించి మాడ వీధుల్లో విహరించున్నారు. ఈ రోజు స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి రానున్నారు. By Kusuma 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సగటు అప్పుల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్! TG: రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,20,509 అప్పు ఉన్నట్లు నాబార్డ్ 2021-22 సర్వే తెలిపింది. సగటు సభ్యుల సంఖ్య 3.8 నుంచి 4.1కి చేరినట్లు పేర్కొంది. దేశంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల్లో తెలంగాణ (92%), ఏపీ (36%) తొలి రెండు స్థానాలలోఉన్నట్లు తెలిపింది. By V.J Reddy 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కు ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్లో జరిగే రెండు వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. కాగా సీఎం అయ్యాక చంద్రబాబు వరుస తెలంగాణ పర్యటనలు చేస్తున్నారు. TGలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకే బాబు పర్యటనలు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. By V.J Reddy 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada:బెజవాడ కనక దుర్గమ్మ హంస వాహన సేవ రద్దు..ఎందుకంటే! నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరిరోజు నిర్వహించే దుర్గమ్మ హంస వాహనం సేవను అధికారులు రద్దు చేశారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. By Bhavana 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn