Ambati Rambabu: జగన్ కాదు.. నువ్వే అతి పెద్ద సైకో.. బాలయ్యకు అంబటి, వైసీపీ నేతల స్ట్రాంగ్ కౌంటర్!

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ను "సైకో" అని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కౌంటర్ ఇచ్చిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ‘‘బాలకృష్ణే ప్రపంచంలో అతి పెద్ద సైకో.. కావాలంటే సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తా !’’ అంటూ పోస్టు పెట్టారు.

New Update
ambati rambabu counter to MLA Balakrishna for sensational comments on ap ex cm ys jagan

ambati rambabu counter to MLA Balakrishna for sensational comments on ap ex cm ys jagan

ఏపీ మాజీ సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ‘‘జగన్ ఒక సైకోగాడు’’ అంటూ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సమాధానం ఇచ్చారు. బాలకృష్ణ ప్రపంచంలోనే అతి పెద్ద సైకో అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. కావాలంటే సర్టిఫికెట్ కూడా ప్రొడ్యూస్ చేస్తానంటూ బాలయ్య వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘శ్రీ శ్రీ శ్రీ నందమూరి బాలకృష్ణ.. ప్రపంచంలోనే అతి పెద్ద సైకో!.. కావాలంటే సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తా !’’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. ఇప్పుడిది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.  

ఏం జరిగిందంటే..?

ఇవాళ అసెంబ్లీ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గత వైసీపీ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో జగన్ ఇండస్ట్రీ నటులపై శాడిజం చూపించారని అన్నారు. సినీ పెద్దలైన చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి.. ఇలా చాలా మంది నటులు, దర్శకులు సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ ధరల గురించి వివరించడానికి జగన్‌ను కలవడానికి వెళ్లారన్నారు. 

ఆ సమయంలో జగన్ తనను కలవడానికి కొందరి పేర్లే ఇవ్వడంతో వారే వెళ్లారని.. ఆ లిస్ట్‌లో బాలకృష్ణ పేరు లేదని తెలిపారు. జగన్ కేవలం తనకు నచ్చిన వారిని మాత్రమే కలిశారన్నారు. ముందుగా లిస్ట్‌లో  పేర్లున్న వ్యక్తులు జగన్‌ కలవడానికి నిరాకరించినా.. చిరంజీవి ముందుండి వారందరినీ బ్రతిమిలాడి జగన్ వద్దకు తీసుకెళ్లారని తెలిపారు. అప్పుడే జగన్ వారిని గేటు ముందు దించేసి.. దిగి రమ్మని చెప్పి అవమానించారని అన్నారు. ఆ తర్వాత లోపలికి వెళ్లిన తర్వాత పోసాని కృష్ణమురళీని జగన్ తన ముందు కుర్చొబెట్టుకుని మరోసారి సినీ పెద్దలను అవమానించారని తెలిపారు. అంతక ముందు జగన్ మిమ్మల్ని కలవడం కుదరదని.. సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మాట్లాడతారని ఓ వ్యక్తి వారికి చెప్పినట్లు తెలిపారు. అప్పుడే చిరంజీవి కాస్త గట్టిగా మాట్లాడటంతో జగన్ వచ్చారని అన్నారు. 

ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ పెద్దలు అందరూ కలిసి సైకోగాడిని కలవడానికి వెళ్లినపుడు.. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ వచ్చాడన్నది అబద్దం అని అన్నారు. అక్కడ గట్టిగా ఎవరూ అడగలేదు. ఇదంతా అసత్య ప్రచారం అని తెలిపారు. అవమానించడం అంతా ఒకే కానీ.. ఆయనేదో గట్టిగా అడిగితేనే జగన్ వచ్చాడన్నది అబద్దం అని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో మొన్నకూడా తనకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చిందని అన్నారు. అందులో తనది 9వ పేరు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ను కూడా అడిగానని అన్నారు. ఇప్పుడిది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

అంబటి రాంబాబుతో పాటు వైసీపీ నేతలు బాలకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘‘బాలకృష్ణ నువ్వే ఒక సైకో’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి అమర్నాద్, జూపూడి ప్రభాకర్ సహా మరెంతో మంది సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు.

Advertisment
తాజా కథనాలు