Chiranjeevi Vs Balakrishna: చిరు చెప్పిందే కరెక్ట్.. బాలయ్యకు ఆర్.నారాయణమూర్తి స్ట్రాంగ్ కౌంటర్

చిరంజీవిని జగన్ అవమానించలేదని ఆర్ నారాయణమూర్తి చెప్పారు. ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్‌పై చిరంజీవి స్పందన 100% నిజం. జగన్‌ను కలిసిన వాళ్లలో నేనూ ఉన్నాను. సినిమావాళ్లకు జగన్ ఎంతో గౌవరం ఇచ్చారు. నేను బాలకృష్ణ గురించి మాట్లాడదల్చుకోలేదంటూ మాట్లాడారు.

New Update
r narayana murthy strong counter to mla balakrishna

r narayana murthy strong counter to mla balakrishna

ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి స్పందించిన తీరు 100 శాతం నిజం అని నటుడు ఆర్.నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ కోవిడ్ సమయంలో పరిశ్రమ ఏమవుతుందోనన్న భయంతో ఉన్నపుడు చిరంజీవి ముందుండి సినీ పెద్దలతో చర్చించారు. ఆయన నన్ను కూడా సంప్రదించారు. ఆ తర్వాత చిరంజీవి ఆధ్వర్యంలో మేము జగన్ మోహన్ రెడ్డిని కలశాం. 

narayana murthy counter to balakrishna

ఆ సమయంలో జగన్ ఎవరినీ అవమానించలేదు. ఆయన ఎంతో సానుకూలంగా స్పందించారు. అందరికీ గౌవరం ఇచ్చారు. ఇండస్ట్రీకి ఏం కావాలో అది చేస్తాం అన్ని అన్నారు. గత గవర్నమెంట్ చిరంజీవిని, సినీ పెద్దలను అవమానించారు అనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. అదంతా తప్పు. చిరంజీవి నాకు స్వయంగా ఫోన్ చేశారు. అది ఆయన సంస్కారం. చిరంజీవి పరిశ్రమ పెద్దగా సీఎం జగన్‌తో మాట్లాడారు.

చిరంజీవి వల్లే ఆ రోజు సమస్య పరిష్కారం అయింది. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నాను. గత ప్రభుత్వంలో ఏ సమస్యలైతే ఇండస్ట్రీలో ఉన్నాయో ఇప్పుడూ అవే సమస్యలు ఉన్నాయి. వాటిని చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరిష్కరించాలి. నేను బాలకృష్ణ గురించి మాట్లాడదల్చుకోలేదు. సినిమా టికెట్ ధరలు పెంచకూడదు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమే. అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతాడు.’’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. 

Advertisment
తాజా కథనాలు