MLA Balakrishna: వాడో సైకో.. అసెంబ్లీలో జగన్ పై రెచ్చిపోయిన బాలయ్య-VIDEO

ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో రెచ్చిపోయారు. మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో సినిమా ఇండస్ట్రీని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని.. మాజీ సీఎం జగన్ ఒక ‘‘సైకోగాడు’’ అంటూ మాట్లాడారు.

New Update
MLA Balakrishna sensational comments on ap ex cm ys jagan

MLA Balakrishna sensational comments on ap ex cm ys jagan

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో రెచ్చిపోయారు. మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో సినిమా ఇండస్ట్రీని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని.. మాజీ సీఎం జగన్ ఒక ‘‘సైకోగాడు’’ అంటూ మాట్లాడారు. ఇంతకీ బాలయ్య అసెంబ్లీలో కట్టలు తెంచుకోవలసిన అవసరం ఏమొచ్చింది. అంతలా ఫైర్ అవ్వడానికి గల కారణం ఏంటి? అనే విషయానికొస్తే.. 

MLA Balakrishna

బాలయ్యా బాబు మాట్లాడక ముందు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో సినీ ఇండస్ట్రీ ఎదుర్కొన్న సమస్యలు, టికెట్ రేట్ల గురించి వివరించడానికి సినీ పెద్దలు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, మొదలైన వారు అప్పటి సీఎం జగన్‌ను కలిశారు. ఆ సమయంలో జగన్ ఇప్పుడు కలవడం కుదరదని చెప్పించారని.. వెళ్లి సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమని చెప్పారని తెలిపారు. దీంతో చిరంజీవి కలుగజేసుకుని గట్టిగా మాట్లాడితే.. జగన్ వచ్చి కలిశారని ఎమ్మెల్యే కామినేని అసెంబ్లీలో పేర్కొన్నారు. 

దీంతో ఎమ్యెల్యే బాలయ్య బాబు ఆయన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలపై సీరియస్‌ అయ్యారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ.. కామినేని శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి గట్టిగా అడగటం వల్లే జగన్ వచ్చి కలిశారని చెప్పడం అంతా అవాస్తవమన్నారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ గట్టిగా మాట్లాడలేకపోయారని తెలిపారు. అది మాత్రమే కాకుండా ప్రస్తుత ప్రభుత్వంలో జనసేన మంత్రి కందుల దుర్గేష్‌పై బాలయ్యబాబు ఫైర్ అయ్యారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కమిటీలో తనది 9వ పేరుగా నమోదు చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి చూసుకోవాలంటూ చురకలు అంటించారు. ఇలా బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. 

Advertisment
తాజా కథనాలు