Aghori - Sri Varshini: వాడు అఘోరి కాదు.. మంత్రాలు అసలే రావు.. ఇదే నా ఛాలెంజ్.. వర్షిణి సంచలన వీడియో!

లేడీ అఘోరీ నన్ను నమ్మించి మోసం చేశాడు. నేను ఎవరో తెలియదంటున్నాడంటూ తాజాగా RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్షిణీ సంచలన కామెంట్స్ చేసింది. ఇంటికొచ్చి పూజలు చేస్తానని మందు, సిగరెట్ తాగేవాడు. వాడి నోటి నుంచి ఒక్క మంత్రం కూడా వినలేదు అంటూ చెప్పుకొచ్చింది.

New Update

గత కొద్ది నెలల క్రితం లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్, బీటెక్ స్టూడెంట్ శ్రీవర్షిణీ వ్యవహారం రెండు తెలుగు రాష్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎక్కడో సనాతన ధర్మం పేరుతో రోడ్లపై నగ్నంగా తిరిగి హల్ చల్ చేసిన అఘోరీ.. వర్షిణీ అనే యువతితో ప్రేమలో పడి చివరికి పెళ్లి చేసుకునేంత వరకు ఈ మొత్తం సంఘటన అనేక మలుపులు తిరిగింది. అచ్చం సినిమా స్టైల్లో.. ఎమోషన్స్, రొమాన్స్, యాక్షన్, ఛేజింగ్, డబ్బు.. ఇలా ప్రతి ఇన్సిడెంట్ వీరి వ్యవహారంలో జరగడం చూశాం. 

Sri Varshini - Lady Aghori

అయితే అఘోరీని ఎప్పుడైతే జైల్లో వేశారో.. అప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దీంతో కథ మొత్తం మారిపోయింది. ఒకవేళ మళ్లీ అఘోరీ జైలునుంచి బయటకి వచ్చాక ఇద్దరూ కలుస్తారని అంతా అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. ఇద్దరికి బ్రేకప్ అయిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా అనిపిస్తోంది. ఇది నేను అంటున్న మాటలు కాదు.. స్వయంగా వర్షిణీ ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే మీకే అర్థం అవుతుంది. 

 లేడీ అఘోరీ అరెస్ట్ తర్వాత వర్షిణి కొన్ని నెలల పాటు బయటకు కనిపించలేదు. అప్పుడే వర్షిణి ఏమైందంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే తాజాగా వర్షిణీ RTV ఛానెల్‌కు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అఘోరీ గురించి వర్షిణీ సంచలన విషయాలు బయటపెట్టింది. ‘‘అఘోరీ అలియాస్ శ్రీనివాస్ నన్ను నమ్మించి మోసం చేశాడు.. ఇపుడు నేను ఎవరో తెలియదు అంటున్నాడు. మా ఇంటికి వచ్చి నాకు మాయ మాటలు చెప్పి నమ్మించాడు.

రోడ్ మీద బట్టలు లేకుండా తిరుగుతుంటే బట్టలు ఇచ్చాం.. అప్పుడే నాకు పరిచయం అయ్యాడు. ఇంటికి వచ్చి పూజలు చేస్తా అని చెప్పి మందు, సిగరెట్ తాగేవాడు. ఒక్క ఫోన్ తో లక్షలు వస్తాయని మాయ మాటలు చెప్పాడు. వాడి ట్రాన్స్ లో పడ్డాను. నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. వాడితో బయటకు వెళ్ళినప్పుడు ఆడపిల్లగా చాలా ఇబ్బందులు పడ్డాను. వాడికి పూజలు కాదు కదా వందేమాతరం కూడా పాడటం రాదు. 

వాడు అసలు అఘోరానే కాదు.. వాడితో ఉన్నన్నాళ్లు వాడి నోటి నుంచి ఒక్క మంత్రం కూడా వినలేదు. వాడి గురించి అసలు నిజాలు తెలిసాకే వదిలేశాను. ఇపుడు నాకు నా తల్లిదండ్రులే దిక్కు. వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు. వాడి వల్ల నా కెరీర్ డ్యామేజ్ అయింది. ఇపుడు నేను కెరీర్ మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. అఘోరీ శ్రీనివాస్ మళ్ళీ నువ్ నా జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకోకు.. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్’’ అంటూ ఇంటర్వ్యూలో అఘోరీకి గట్టి వార్నింగ్ ఇచ్చింది. 

Advertisment
తాజా కథనాలు