AP Crime: తమ్ముడూ నా పిల్లలు జాగ్రత్తరా.. ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య!

తమ్ముడూ నా భర్త వేధింపులు భరించలేకపోతున్నాను రా.. నా పిల్లను భద్రంగా చూస్కో రా అంటూ సోదరుడికి మెసేజ్ పంపించి ఆత్మహత్యకు పాల్పడింది ఓ వివాహిత . ఈ విషాదకర ఘటన పాలకొల్లు మండలం పూలపల్లిలో చోటుచేసుకుంది.

New Update
CRIME

CRIME

తమ్ముడూ నా భర్త వేధింపులు(Husband Harassment Wife) భరించలేకపోతున్నాను రా.. నా పిల్లను భద్రంగా చూస్కో రా అంటూ సోదరుడికి మెసేజ్ పంపించి ఆత్మహత్య(suicide) కు పాల్పడింది ఓ వివాహిత . ఈ విషాదకర ఘటన పాలకొల్లు మండలం పూలపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం మండలం వెంపకు చెందిన ఝాన్సీ యలమంచిలి మండలానికి చెందిన టి.దుర్గాపెద్దిరాజుకు 13 ఏళ్ళ కిందట వివాహం జరిగింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కుటుంబ తగాదాల కారణంగా పాలకొల్లు మండలం పూలపల్లిలో వేరు కాపురం పెట్టారు. ఈ క్రమంలో కొద్దికాలంగా తాగుడుకు బానిసైన భర్త దుర్గా తరచూ భార్యను వేధింపులకు గురిచేయడం, హింసించడం మొదలు పెట్టాడు. నిన్న బుధవారం రాత్రి కూడా ఫుల్లుగా మద్యం తాగిచ్చి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన ఝాన్సీ..  ఆమె సోదరుడికి ఒక మెసేజ్ పంపించింది. ''తమ్ముడూ నా భర్త వేధింపులు భరించలేకపోతున్నాను .. నా పిల్లలు జాగ్రత్త''  అని మెసేజ్ పెట్టింది.

Also Read :  పెళ్లి చేసుకుంటానని నమ్మించి టీచర్ పై అత్యాచారం

భర్త వేధింపులు తట్టుకోలేక.. 

దీంతో ఆమె తండ్రి మర్నాడు ఉదయం హుటాహుటిన బయలుదేరి కూతురి దగ్గరకు వచ్చేసరికి.. ఝాన్సీ  మృతదేహంగా కనిపించింది. గదిలో ఫ్యాన్ కు చీర వేలాడుతూ కనిపించింది. దీంతో ఝాన్సీ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహాత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.  ఝాన్సీ మరణంతో ఆమె తల్లిదండ్రులు, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై ఝాన్సీ ప్రభు దాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. భర్త పెద్దిరాజు, మామ వీరభద్రరావు, అత్త సత్యవతిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పిల్లలు జాగ్రత్తరా.. ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య!

Also Read: AP Crime: మనసును కలచివేసే ఘటన... అనంతపురంలో వేడి పాల గిన్నెలో పడి బాలిక మృతి

Advertisment
తాజా కథనాలు