ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి నోటీసులు! AP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని కోరారు. కాగా తిరుమల మాఢవీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ రీల్స్ చేశారని టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. By V.J Reddy 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బ్లాక్‌లో టీటీడీ వీఐపీ దర్శన టికెట్లు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు! AP: వైసీపీ మాజీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై తిరుమల పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీవారి దర్శన టికెట్లలో మోసం చేశారని బెంగళూరుకు చెందిన భక్తుడు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆరు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లకు రూ.65 వేలు వసూలు చేశారని అందులో పేర్కొన్నారు. By V.J Reddy 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏంటి బ్రో ఇంత తాగేశారు.. మూడు రోజుల్లో మరీ ఇన్ని కోట్ల ఆదాయమా ఏపీలో నూతన మద్యం విధానం మొదలైన మూడురోజులకే కోట్లలో ఆదాయం వచ్చింది. మూడు రోజులకే రూ.541 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. మొత్తం 6,77,511 కేసుల లిక్కర్ అమ్మకాలు, 1,94,261 బీర్ల అమ్మకాలు జరిగాయని అన్నారు. By Seetha Ram 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు స్పాడ్ డెడ్ ఎన్టీఆర్ జిల్లా గరికపాడు సమీపంలో NH-65పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వాసులు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో తల్లి, కొడుకు స్పాట్లోనే మృతి చెందారు. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు శారదా పీఠానికి షాక్.. భూ కేటాయింపులు రద్దు విశాఖపట్నంలోని స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో జగన్ శారదా పీఠానికి ఇచ్చిన అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కార్ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పవన్ స్కెచ్.. జగన్‌కు షాక్! AP: వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేనలో చేరారు. ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. ఆమె వెంట గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు జనసేనలో చేరారు. By V.J Reddy 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి! AP: బద్వేల్లో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. శనివారం విద్యార్థినిపై ప్రేమోన్మాది విఘ్నేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. By V.J Reddy 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో మరో అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్లు చెబుతున్నాయి. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కోడలిపై కన్నేసిన మామ.. కోరిక తీర్చలేదని ఏం చేశాడంటే? నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. నందికొట్కూరు మండలం నాగటూరులో ఓ మహిళ తన పొలంలో పని చేసుకుంటుండగా.. మొక్కజొన్న కంకులు ఏరడానికి వచ్చిన మామ కురుమన్న ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె నిరాకరించడంతో బండరాయితో తలపై కొట్టాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. By Seetha Ram 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn