/rtv/media/media_files/2025/10/23/jagan-assembly-membership-cancelled-2025-10-23-16-48-19.jpg)
Jagan's Assembly membership cancelled ?
Raghuram Krishna Raju : వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎమ్మెల్యే సభ్యత్వం రద్దువుతుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అసెంబ్లీ 60 పని దినాలలో ఎలాంటి సమాచారమూ లేకుండా ఎవరైనా గైర్హాజరైతే అతడి శాసన సభ్యత్వం ఆటోమేటిగ్గా రద్దవుతుంది. అయితే ఈ విషయాన్ని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(raghu rama krishnam raju) గతంలోనే స్పష్టం చేశారు. అయితే తాజాగా ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. సాధారణ ఎన్నికలు పూర్తయ్యాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఆ తర్వాత అసెంబ్లీ(assembly)లో అధికారికంగా సంతకం చేయకపోవటంతో ఆయన సభ్యత్వం రద్దు అంశంపై చర్చ జరుగుతోంది.
గతంలో రఘురామరాజు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా కోసం కోర్టులో కేసు వేశానంటే కుదరదని స్పష్టం చేశారు. అసెంబ్లీ 60 పని దినాలలో ఎలాంటి సమాచారమూ లేకుండా గైర్హాజరైతే అతడి శాసన సభ్యత్వం ఆటోమేటిగ్గా రద్దవుతుందని తేల్చిచెప్పారు. దీంతో జగన్ సభ్యత్వం పై మరోసారి చర్చ సాగుతోంది. శాసనసభ్యులు 60 రోజుల పనిదినాల్లో కనీసం ఒక్కరోజైనా అసెంబ్లీకి హాజరుకాకపోతే వారి శాసనసభ సభ్యత్వం రద్దవుతుందన్న నిబంధన ఆయనకు వర్తించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 2024 సాధారణ ఎన్నికలు పూర్తయ్యాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే జగన్ హాజరయ్యారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఆయన హాజరు నమోదు కాలేదు. గవర్నర్ ప్రసంగానికి వచ్చినా జగన్ హాజరు మాత్రం నమోదు కాలేదని తెలుస్తోంది.
Also Read : తుని నారాయణ రావుకు ఇద్దరు భార్యలు.. పోస్టుమార్టం సమయంలో బిగ్ ట్విస్ట్!
Raghuram Krishna Raju Warns YS Jagan
గత ఏడాది జూలైలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సమయంలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన సమయంలో జగన్ శాసనసభకు వచ్చారు. ఆ తర్వాత బడ్జెట్​ సమావేశాల్లోనూ ఫిబ్రవరి 24న గవర్నర్​ ప్రసంగానికి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం ఈ రెండు రోజులూ శాసనసభ జరిగినట్టు అధికారికంగా పరిగణించరు. దీంతో జగన్ శాసనసభకు హాజరుకానట్టుగానే నిలిచిపోయింది.నిజానికి ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని శాసనసభ, మండలి వేర్వేరుగా తమ రోజువారీ అజెండాలో బిజినెస్​గా చేర్చుకుని ఆ తీర్మానంపై చర్చించినప్పుడే అది ప్రోసీడింగ్స్​లోకి చేరుతుంది. అదే ఆయా సభలకు బిజినెస్ డేగా లెక్కించాల్సి ఉంటుందని శాసనసభా వ్యవహారాల నిపుణులు అంటున్నారు. అప్పటివరకూ అది అసెంబ్లీ లేదా మండలి బిజినెస్‌గా పరిగణించరని గుర్తు చేస్తున్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ప్రకారం విధాన పరిషత్​కు ఎగ్జిక్యూటివ్ హెడ్‌గా గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ ప్రసంగాన్ని శాసనపరిషత్ కార్యదర్శి అధికారికంగా టేబుల్ చేసిన తర్వాత మాత్రమే అది సభ ప్రోసీడింగ్స్​లోకి వస్తుందని నిబంధనలున్నాయి. సాంకేతికంగా గవర్నర్ ఉభయసభలకు చెందిన సభ్యుడు కాకపోవటంతో ఆయన ప్రసంగాన్ని మాత్రమే శాననసభ పరిగణనలోకి తీసుకుంటుంది.
గవర్నర్ ప్రసంగం చేసిన రోజు అధికారికంగా శాసనసభ జరిగినట్టు కాదని అధికారులు అంటున్నారు.ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టిన రోజే శాసనసభ లేదా మండలికి అధికారిక బిజినెస్ డే అవుతందని తేల్చి చెబుతున్నారు. రెండుసార్లూ జగన్ వచ్చిన రోజులు శాసనసభ బిజినెస్ డే గా నమోదు కాకపోవటంతో ప్రస్తుతం ఆయన హాజరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆయన సభ్యత్వం రద్దు విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆయన విచాక్షణాధికారం దృష్ట్యా ఆచీతూచీ నిర్ణయం తీసుకుంటారు. అయితే ఏపీలో ప్రస్తుతం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే అంశంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read: గాల్లోనే ఇండిగో ఫ్లైట్ ఇంధన లీకేజీ.. గజగజ వణికిపోయిన 166 మంది ప్రయాణికులు