/rtv/media/media_files/2025/10/24/bus-challan-telangana-2025-10-24-10-00-08.jpg)
కర్నూలు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి... ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పీఎం
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Kurnool Bus Accident) చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44పై ప్రయాణిస్తున్న వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. గాయపడిన వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ బస్సు ప్రమాదం(bus-fire-accident)పై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఎక్స్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Also Read : కర్నూలు బస్సు ప్రమాదం...ప్రయాణికుల వివరాలు, ఎక్కడెక్కడి నుంచి ఎక్కరంటే?
ఈ ఘోర బస్సు ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించారు.ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు దృష్టికి అధికారులు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సీఎస్‌తో పాటు ఇతర అధికారులతో మాట్లాడిన చంద్రబాబు ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను సీఎం ఆదేశించారు. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. తక్షణమే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. గద్వాల కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలికి వెళ్లాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయకచర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై సీఎస్, డీజీపీతో మాట్లాడారు.
Also Read : కర్నూలు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Follow Us