YS Jagan: మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన బాలకృష్ణ.. జగన్ సంచలన వ్యాఖ్యలు

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన వాళ్లను అసెంబ్లీలోకి ఎలా అనుమతించారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటని జగన్ ఫైర్ అయ్యారు. 

New Update
JAGAN BALAKRISHNA

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ(balakrishna) పై వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) సంచలన ఆరోపణలు చేశారు. మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన వాళ్లను అసెంబ్లీలోకి ఎలా అనుమతించారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటని జగన్ ఫైర్ అయ్యారు. నందమూరి బాలకృష్ణ తాగొచ్చి అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడారని అన్నారు. ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందనన్నారు. తాగిన వాళ్లను స్పీకర్ ఎలా అసెంబ్లీలోకి అనుమతించారని జగన్ నిలదీశారు.  

Also Read :  తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో హై అలర్ట్

YS Jagan Fire On Balakrishna

Also Read :  కాకినాడ తుని కేసులో సంచలనం..చెరువులో దూకి నిందితుడు సూ**సైడ్!

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో(assembly-meetings) సినీ పెద్దలు గత ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిసిన అంశంపై బాలకృష్ణ మాట్లాడారు. ఆ సమయంలో ఆయన పౌరుష పదజాలాన్ని వాడి వైఎస్ జగన్‌ని సైకో అని చెప్పుకొచ్చారు. బాలక‌ృష్ణ వ్యాఖ్యలపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడాడని జగన్ అన్నారు. తాగినోడిని అసెంబ్లీలో ఎలా మాట్లాడిస్తారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు స్పీకర్‌కు బుద్ధి లేదని జగన్ శాసనసభ స్పీకర్‌పై ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో అలా తాగి మాట్లాడాడు అంటే.. బాలకృష్ణ మెంటల్‌ హెల్త్ ఎలా ఉందో అర్ధం చేసుకోండని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.

Advertisment
తాజా కథనాలు