/rtv/media/media_files/2025/10/23/kolikapudi-srinivas-keshineni-chinni-2025-10-23-15-25-07.jpg)
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు(KOLIKAPUDI SRINIVAS RAO) సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో తనకు టీడీపీ తిరువూరు టికెట్ ఇవ్వడానికి కేశినేని శివనాథ్ (చిన్ని) రూ.5 కోట్లు అడిగాడని ఆరోపించారు. దీంతో తన ఖాతా నుంచి గతేడాది ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, 8న రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశానన్నారు. పోరంకిలో శివనాథ్ పీఏ మోహన్ కు రూ.50 లక్షలు ఇచ్చానన్నారు. గొల్లపూడిలో తన మిత్రులు రూ.3.5 కోట్లు ఇచ్చారన్నారు. ఈ విషయాల గురించి రేపు మాట్లాడుకుందామన్నారు. 'నిజం గెలవాలి.. నిజమే గెలవాలవాలి'.. అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
Also Read : మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన బాలకృష్ణ.. జగన్ సంచలన వ్యాఖ్యలు
Also Read : కాకినాడ తుని కేసులో సంచలనం..చెరువులో దూకి నిందితుడు సూ**సైడ్!
Kolikapudi Srinivas Sensational Allegations On MP Keshineni Chinni
ఈ అంశంపై కేశినేని చిన్నీ(keshineni-chinni) సైతం స్పందించారు. తను ఎప్పుడూ తన జేబులోని డబ్బులను మాత్రమే ఖర్చు పెడతానన్నారు. గతంలో ఎంపీ లేకపోతే తాను లేనని ఎమ్మెల్యే కొలికపూడి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తాను కోవర్టులకు పదవులు ఇవన్నన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మరన్నారు. ఎవరు ఎవరి పంచన చేరారో అందరికీ తెలుసన్నారు.
ఈ రోజు తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్ని పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి లేకుండానే ఈ పర్యటన సాగింది. వీరిద్దరి మధ్య విభేదాలతోనే చిన్న నేడు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండానే తిరువూరుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆగ్రహానికి గురైన కొలికిపూడి ఈ ఆరోపణలు చేసినట్లు టీడీపీలో చర్చ సాగుతోంది. వీరిద్దరి మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేసే ప్రమాదం ఉండడంతో టీడీపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. రేపు ఈ ఇద్దరు నేతలను టీడీపీ ఆఫీసుకు రావాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆహ్వానించారు.