/rtv/media/media_files/2025/10/22/tdp-leader-1-2025-10-22-12-02-58.jpg)
కాకినాడ తుని కేసు(Tuni Incident) లో సంచలనం చోటుచేసుకుంది. బాలికపై అత్యాచారయత్నానికి(rape-attempt) పాల్పడిన నారాయణ రావు సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసులు అదుపులో ఉన్న ఆయన గురువారం ఉదయం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. పోలీసు కస్టడీలోనే నిందితుడు నారాయణ ప్రాణాలు తీసుకున్నాడు. మెజిస్ట్రేట్ ముందు నారాయణరావును హాజరుపర్చడానికి తీసుకెళ్తుండగా టాయిలెట్ వస్తుందని చెప్పి పోలీసు వాహనం నుంచి కిందికి దిగిన నారాయణరావు తప్పించుకొని సమీపంలో ఉన్న తుని కోమటిచెరువులో దూకాడు. నిందితుడి కోసం గజ ఈత గాళ్లతో పోలీసుల గాలింపు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని డిఎస్పీ శ్రీహరిరాజు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడి డెడ్ బాడీ లభ్యమైంది.
నిందితుడు నారాయణ రావు పోస్టుమార్టంపై సస్పెన్షన్ నెలకొంది. మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడు నారాయణ రావు మృతదేహం తుని ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో ఉంది. నారాయణ రావు టీడీపీ నేత కావడంతో సోషల్ మీడియాలో వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఈ కేసు చాలా సీరియస్‌గా తీసుకుంది.
నారాయణ రావుకి ఇద్దరు భార్యలు(Narayana Rao Family) ఉన్నారు. పోస్టుమార్టం నిర్వహించాలంటే కుటుంబ సభ్యుల సంతకాలు అవసరం.. సంతకాలు పెట్టేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో పోలీసు అధికారులు నారాయణ రావు ఫ్యామిలీతో చర్చలు చేస్తున్నారు. హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులతో డీఎస్పీ శ్రీహరి రాజు, సీఐ చెన్నకేశవ్ పోస్టుమార్టం కోసం సంతకాలు పెట్టించేందుకు మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యులు మెజిస్ట్రేట్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని కోరారు. మెజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడంతో ఆర్డీవో లేదా ఎమ్మార్వో సమక్షంలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసు అధికారులు. పోస్టుమార్టంను కూడా వీడియోగ్రఫీ తీయనున్నారు. తుని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.
Also Read : జగన్ అసెంబ్లీ సభ్యత్వం రద్దు ? రఘురామకృష్ణరాజు సంచలన వార్నింగ్
కేసు వివరాలు..
జగన్నాథగిరి గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికకు తాను తాతయ్య వరుస అవుతానంటూ మాయమాటలు చెప్పి.. ఆ బాలికను స్కూల్ నుండి స్కూటిపై ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు టీడీపీ నేత తాటిక నారాయణరావు. అయితే నారాయణరావును తెలియకుండా ఓ వ్యక్తి అతన్ని ఫాలో అవుతూ వీడియో తీశాడు. దీంతో ఇంతంటి దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో తీస్తూ ఉండగా బాలిక దుస్తులు వేసుకుంటూ ఉండగా ఆ బాలికను ఏం చేశావ్ అంటూ టీడీపీ నేతను వీడియో తీస్తున్న వ్యక్తి ప్రశ్నించాడు. సమాధానం చెప్పకుండా ఏం చేస్తావో చేసుకో అంటూ ఆ బాలికను బైక్ పై ఎక్కించుకుని పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read : TDP టికెట్ కోసం రూ.5 కోట్లు.. ఎంపీ కేశినేని చీన్నీపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు!
Follow Us