Chandrababu Birthday: అనితర సాధ్యుడు, దార్శనికుడు.. చంద్రబాబు బర్త్ డే సందర్భంగా పవన్ పోస్ట్ వైరల్!
ఏపీ సీఎం చంద్రబాబు వజ్రోత్సవ జన్మదినం సందర్భంగా పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. అనితరసాధ్యుడు, రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపజేసిన దార్శనికుడంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం అన్నారు.