Chandrababu Birthday: అనితర సాధ్యుడు, దార్శనికుడు.. చంద్రబాబు బర్త్ డే సందర్భంగా పవన్ పోస్ట్ వైరల్!

 ఏపీ సీఎం చంద్రబాబు వజ్రోత్సవ జన్మదినం సందర్భంగా పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. అనితరసాధ్యుడు, రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపజేసిన దార్శనికుడంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం అన్నారు. 

New Update
Pawan Kalyan : చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్

AP CM Chandrababu Birthday Pawan Kalyan Interesting Post

Chandrababu Birthday: ఏపీ సీఎం చంద్రబాబు వజ్రోత్సవ జన్మదినం సందర్భంగా పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. అనితర సాధ్యుడు, 
రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపజేసిన దార్శనికుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం అన్నారు. 

Also Read: TS: తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగాలు..సీఎం రేవంత్ ఒప్పందాలు

Also Read: Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ

ఆ విధానం స్ఫూర్తిదాయకం..

ఈ మేరకు 'ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని  పునర్జీవింప చేయడం నారా చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన చంద్రబాబు సంపూర్ణ ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను' అని కోరారు. 

Also Read: Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ

అలాగే కుప్పంలో ఓటమి ఎరుగని చంద్రబాబుపై ప్రజలు ఎనలేని ప్రేమాభిమానాలు చూపించారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. కుప్పంలోని పూరి ఆర్ట్స్ కళాకారుడు పురుషోత్తం వైట్ షీట్ పై చంద్రబాబు నమూనా చిత్రాన్ని రూపొందించారు. సైడ్ లైన్స్, బోర్డర్ తో ఆయన రూపం వచ్చేలా ఆర్ట్ వేశారు. ఇంక్ ప్యాడ్ ల సహాయంతో కుప్పం మహిళలు, చిన్నారులు, పురుషుల వేలి ముద్రలతో సీఎం చిత్రపటం వచ్చేలా రూపొందించారు. దాదాపు 2000 వేల మందికి పైగా వేలిముద్రలు వేసి చంద్రబాబు పోర్ట్రెయిట్ వచ్చేలా చేశారు. అనంతరం ఈ పోర్ట్రెయిట్‌ను కుప్పం నలుమూలల తిప్పి సంబరాలు చేసుకున్నారు.

Also Read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత

 cm-chandrababu | birthday | telugu-news | today telugu news

 

#today telugu news #birthday #cm chandrababu #telugu-news #Pawan Kalyan
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు