Annamalai: అన్నామలైకి బీజేపీ బంపరాఫర్.. ఏపీ నుంచి రాజ్యసభకు..!

తమిళనాడు బీజేపీ నేత అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది. విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన స్థానంలో అధిష్ఠానం ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేయనుంది. ఇటీవల ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలను నుంచి ఆయన తప్పుకున్నారు.

New Update

తమిళనాడు బీజేపీ నేత అన్నామలైకి భారతీయ జనతా పార్టీ బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. అన్నామలైను బీజేపీ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్ఠానం ఆలోచిస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. విజయసాయిరెడ్డి స్థానంలో అన్నామలై పేరు దాదాపు ఖరారు అయినైట్లే. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై కొన్నిరోజుల క్రితం ఆ పదవి నుంచి తప్పుకున్నాడు.

Also read: Azharuddin- HCA: అజారుద్దీన్‌కు బిగ్ షాక్.. ఉప్పల్ స్టేడియంలో ఆయన పేరు మాయం 

Also read: Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ

రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను నుంచి తప్పుకొని

తమిళనాడులో ఎంపీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి పోడిపోయాడు. తమిళనాడులో బీజేపీ బలోపేతంలో అన్నామలై పాత్ర కీలకం. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఆయనకు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. మాజీ మంత్రి స్మృతి ఇరానీ కూడా రాజ్యసభ ఎంపీ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఎంపీ సీటు జీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం అన్నామలైకే మొగ్గు చూపినట్లు సమాచారం. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తమిళనాడు బీజేపీ రాజకీయాల్లో కీలకంగా మారునుంది. 

(annamalai | annamalai-bjp | rajyasabha | rajyasabha-seat | andhra-paradesh | tamilanadu | latest-telugu-news)

Advertisment
తాజా కథనాలు