/rtv/media/media_files/2025/04/20/IwEwam9Q8VUKsBIeJuCM.jpg)
HBD Legend CBN
CM Chandra Babu: పల్లెలో పుట్టారు. తండ్రి రైతు, గ్రామ పెద్దల్లో ఒకరు. ఇదే ఆయన నేపథ్యం. కానీ ఆయన ప్రయాణం మాత్రం అనన్య సామాన్యం. ఒక మామూలు రైతు బిడ్డ చంద్రబాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సీఎంగా మారిన విధానం...అదో మోస్ట్ ఇన్‌స్పైరింగ్ జర్నీ. అతి చిన్న వయసులోనే రాజకీయ నాయకుడిగా ఎదగమే కాకుండా..నాలుగుసార్లు సీఎం అయిన ఘనత కూడా చంద్రబాబుకు దక్కుతుంది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డ్ ను ఎవరూ బీట్ చేయలేరు కూడా. 1950 ఏప్రిల్ 20న పుట్టిన ఆయన ఈరోజు 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ ఏట అడుగుపెట్టారు.
Also Read: TS: తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగాలు..సీఎం రేవంత్ ఒప్పందాలు
/rtv/media/media_files/2025/04/20/0eZLmfjO4mr08FyG0yTY.jpg)
Also Read: Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ
రికార్డ్ ముఖ్యమంత్రి...
1978లో 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో ప్రవేశించాక ఇప్పటి వరకు... సీఎం చంద్రబాబుకు 46 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది. ఇందులో ఆయన అధిరోహించిన శిఖరాలు ఎన్నో...పడిపోయిన లోతులు అన్నే. మామను వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఎన్టీయార్ నుంచి పార్టీని లాక్కున్నారని నిందలు వేశారు. కేసులు పెట్టి జైలుకు పంపించారు. కానీ వేటికీ లొంగలేదు చంద్రబాబు. తాను అనుకున్నది సాధించే వరకూ పట్టువిడవలేదు. ఎన్టీయార్ ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీ ఎలా ఉండేదో తెలియదు కానీ...చంద్రబాబు నాయకత్వంలో మాత్రం అత్యంత ఎత్తుకు ఎదిగింది. ఉమ్మడి తెలుగురాష్ట్రాలకూ ముఖ్యమంత్రికి పని చేసిన ఆయన ఇప్పుడు విడిపోయాక కూడా ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు సీఎం అయ్యారు. అంతేకాదు కేంద్రంలో బీజేపీ నిలబడడానికి ముఖ్య కారణమయ్యారు. మూడోసారి మెజారిటీ సీట్లతో గెలవలేకపోయిన ఎన్డీయే కు మద్దతుగా నిలిచి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు వెన్నుముక అయ్యారు. ఇప్పుడు నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే పనిలో పడ్డారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్షనేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఇప్పటికీ రికార్డే. ఆయన సాధించిన విజయాల్ని తరచి చూస్తే... వాటి వెనుక ఎన్నో త్యాగాలు, అవిరళ కృషి, క్రమశిక్షణ కనిపిస్తాయి.
Also Read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత
/rtv/media/media_files/2025/04/20/H6GbuJQYSK4ioo9720IV.jpg)
/rtv/media/media_files/2025/04/20/ukfTfnN04j75Gqmx6pDh.jpg)
Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
పడిన ప్రతీసారి అంతే ఎత్తుకు ఎదిగారు..
30 ఏళ్ళ వయసులో ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారో ఇప్పుడు 75 ఏళ్ళ వయసులో కూడా అదే తపనతో పని చేస్తున్నారు చంద్రబాబు. ఇంత ఏజ్ లో కూడా నవయువకుడిలా అడుగులు వేస్తున్నారు. రాజకీయ చతురతకు పెట్టింది పేరు చంద్రబాబు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ తనదంటూ ప్రత్యేకమైన మార్క్ కనిపిస్తుంది. ఆయన రాజకీయ ప్రస్థానంలో మొదటి నాలుగు దశాబ్దాలు ఒకెత్తు... గడచిన ఐదేళ్లూ ఒకెత్తు. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైన దశ నుంచి, ప్రతిపక్ష నేత జగన్ ను ఎదురొడ్డి పోరాడి చంద్రబాబు అద్భుత విజయం సాధించారు. జైల్లో పెట్టినా తొణకని.. బెణకని ధీశాలి ఆయన. మిత్రపక్షాలతో కలసి 164 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రావడమే కాకుండా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేయడమే ఆయన స్టైల్. తెలుగుదేశం పని ఇక అయిపోయింది అని అన్నవారి నోళ్ళను మూయించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కిందపడిన ప్రతిసారీ రెట్టించిన ఉత్సాహంతో పోరాటం ప్రారంభించి మళ్లీ గెలిచి చూపించారు.
/rtv/media/media_files/2025/04/20/fdlAHhEDYhkvhbkorwpX.png)
చంద్రబాబు అంటే పని..పని అంటే చంద్రబాబు అని ఆయనకు పేరు. ఆయన పని చేయడమే కాకుండా తన చుట్టూ ఉన్నవారితో, అధికారులతో అంతే నిష్కర్షగా పని చేయిస్తారు. భారీ వర్షాలు, తుపానుల వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు 24 గంటల్లోపే అక్కడికి చేరుకుని పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంతవరకు దగ్గరుండి పర్యవేక్షించిన ముఖ్యమంత్రిని ఆయనకు ముందు ఎవరినీ చూడలేదు. 1996లో కోనసీమను భారీ తుపాను అతలాకుతలం చేసినప్పుడు, ఆయన నవ్యాంధ్ర పగ్గాలు చేపట్టాక హుడ్‌హుడ్, తిత్లీ వంటి తుపానులు ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించినప్పుడు ఆయన వారం, పది రోజులపాటు అక్కడే మకాం వేసి పరిస్థితి చక్కదిద్దాకే వెనుతిరిగారు. అంతేకాదు హైదరాబాద్ ఇప్పుడు ఇంతలా అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం చంద్రబాబే. హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా, ఐటీ హబ్‌గా మార్చడంతో పాటు, ఐఎస్‌బీ, ఐఐఐటీ వంటి అనేక అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమరావతిని ఇలాగే తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నడుం బిగించారు. ఐదేళ్ళల్లో అమరావతిని మరో హైదరాబాద్ లా మారుస్తానని చెబుతున్నారు. అయితే ఆయన ముందు ఇప్పుడు చాలా సవాళ్ళు ఉన్నాయి. కానీ చంద్రబాబు తలుచుకుంటే అవన్నీ అవే ఆటోమాటిక్ గా సాల్వ్ అయిపోతాయి అంటున్నారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు. హైటెక్ సీఎం సీబీఎన్‌కు ఆ సవాలు అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/04/20/70onU9WRutGviB4HROl2.jpg)
/rtv/media/media_files/2025/04/20/nmon5p2tfacuKq4Qch8d.jpg)
today-latest-news-in-telugu | ap cm chandra babu naidu | birth-day