YS Jagan: విశాఖ మేయర్ పీఠం మాదే.. జగన్ సంచలన ప్రకటన!

ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్‌లో YCP గతంలో 58 స్థానాలను కైవసం చేసుకుందని ఆ పార్టీ అధినేత జగన్ అన్నారు. టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచిందన్నారు. అయితే.. ఇప్పుడు కూటమికి మేయర్ పదవి ఎలా వస్తుందని ప్రశ్నించారు.

New Update
JAGAN

విశాఖ మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం.. వైసీపీ మేయర్ పదవి కోల్పోవడంపై ఆ పార్టీ అధినేత జగన్ స్పందించారు. చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవి నుంచి దించి వేశారన్నారు. కూటమి దుర్మార్గపు రాజకీయాలకు ఇది ప్రత్యక్ష సాక్ష్యమని ఫైర్ అయ్యారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్‌లో వైయస్సార్‌సీపీ గతంలో 58 స్థానాలను కైవసం చేసుకుందన్నారు. టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచిందన్నారు. అయితే.. ఇప్పుడు కూటమికి మేయర్ పదవి ఎలా వస్తుందని ప్రశ్నించారు.

బీసీ మహిళకు పదవి ఇచ్చాం..

బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను తాము మేయర్‌ పదవిలో కూర్చోబెట్టామన్నారు. కానీ ఇప్పుడు కూటమి నేతలు అధికార దుర్వినియోగం చేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి ఆమెను పదవి నుంచి దించారని ఆరోపించారు. పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే తమ పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్‌పై మీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారని ధ్వజమెత్తారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయన్నారు. దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది? ప్రశ్నలు గుప్పించారు. 

అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారన్నారు. మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారని ధ్వజమెత్తారు. ఇన్ని ప్రలోభాలు పెట్టినా.. బెదిరింపులకు గురిచేసినా.. తలొగ్గక పార్టీవైపు, ప్రజలవైపు నీతి, నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైయస్సార్‌సీపీ కార్పొరేటర్లను, అలాగే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందిస్తున్నానన్నారు. 

(vizag | telugu-news | telugu breaking news)

#telugu breaking news #telugu-news #vizag
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు