BIG BREAKING: ఆదిత్య ఫార్మసీ ఎండీ ఆత్మహత్య!
ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహ మూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ అయోధ్య నగర్ క్షత్రియ భవన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత ఏడాది స్నేహితుడిని హత్య చేసిన కేసులో నరసింహ మూర్తి రాజు నిందితుడిగా ఉన్నారు.
ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహ మూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ అయోధ్య నగర్ క్షత్రియ భవన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత ఏడాది స్నేహితుడిని హత్య చేసిన కేసులో నరసింహ మూర్తి రాజు నిందితుడిగా ఉన్నారు.
ఇటీవల జైలు నుంచి విడుదలైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ మంత్రి కొడాలి నాని ఈ రోజు కలిశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. కొడాలి నాని వెంట మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ నేతలు తదితరులు ఉన్నారు.
ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు శనివారం ఆయన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ అయోధ్య క్షత్రియ నగర్ కాలనీలోని ఆయన నివాసంలో ఉరేసుకున్నారు. శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదో రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
'ఆపరేషన్ ఈగల్' కార్యక్రమంలో భాంగా ఒడిశా నుంచి ఏపీ వెళ్లే పలు రైళ్లలో జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో విజయవాడ రైల్వేస్టేషన్లో 4 ప్యాకెట్లు చాక్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురవనున్నట్లు తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాాలని వెల్లడించింది.
ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని.. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బిగ్‌షాక్ తగిలింది. తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. జూన్ 22న మధురైనలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ పాల్గొన్నారు. అక్కడ నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.