/rtv/media/media_files/2025/07/05/vallabhaneni-vamshi-kodali-nani-2025-07-05-17-14-21.jpg)
ఇటీవల జైలు నుంచి విడుదలైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ మంత్రి కొడాలి నాని ఈ రోజు కలిశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. కొడాలి నాని వెంట మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ నేతలు తదితరులు ఉన్నారు.
వల్లభనేని వంశీని కొడాలి నాని, పేర్ని నాని కలిశారు.#VallabhaneniVamsi#Kodalinani#perninani#ycp#RTVpic.twitter.com/ozAv44uo83
— RTV (@RTVnewsnetwork) July 5, 2025
టీడీపీలో ఉన్నప్పటి నుంచి వల్లభనేని వంశీ, కొడాలి నాని మంచి స్నేహితులుగా ఉన్నారు. జగన్ నూతన పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే కొడాలి నాని టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ ఆ పార్టీని వీడి వైసీపీకి దగ్గరయ్యారు. ఈ క్రమంలో టీడీపీ, ఆ పార్టీ అధినేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొడాలి నాని సైతం గత ఐదేళ్లలో టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నారా లోకేష్ రెడ్ బుక్ లో వీరి పేర్లు ఉన్నాయని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరు జైలుకు వెళ్లడం ఖాయమన్న ప్రచారం సాగింది. ఈ క్రమంలో వల్లభనేని వంశీ దాదాపు 130 రోజుల జైలు జీవితాన్ని గడిపి ఇటీవలే విడుదలయ్యారు. కొడాలి నాని సైతం త్వరలో అరెస్ట్ కావొచ్చన్న ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది.