/rtv/media/media_files/2025/07/04/ganja-2025-07-04-06-19-32.jpg)
Ganja
గంజాయిని పట్టుకునేందుకు ఈగల్ విభాగం 'ఆపరేషన్ ఈగల్' కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఒడిశా నుంచి ఏపీ వెళ్లే పలు రైళ్లలో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసులు కలిసి తనిఖీలు నిర్వహించారు. ఇందులో భారీగా గంజాయి చాక్లెట్లు లభమయ్యాయి. వీటిని విజయవాడ రైల్వేస్టేషన్‌లో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో, తెనాలి రైల్వేస్టేషన్‌లో జసీదీహ్-తాంబారం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల్లో తనిఖీలు చేయగా.. మొత్తం 4 ప్యాకెట్లు దొరికాయి. విజయనగరం రైల్వేస్టేషన్‌లో రాయగడ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేపట్టగా ఇద్దరి వద్ద మొత్తం 15 కిలోల గంజాయిని తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.