/rtv/media/media_files/2025/07/02/siddarth-koushal-2025-07-02-16-23-21.jpg)
ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని.. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, సహచరులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజానికి కొత్త మార్గాల్లో సేవలందిస్తానన్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకే సిద్దార్థ్ కౌశల్ రాజీనామా చేశారంటూ ఈ రోజు ఉదయం నుంచి కొన్ని మీడియా సంస్థల నుంచి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ స్పందించి తర రాజీనామాపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన ఢిల్లీలోని ఓ కార్పొరేట్ కంపెనీలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఏపీలో తనదైన మార్క్ చూపించి విధులు నిర్వర్తించారు సిద్ధార్థ్. ముఖ్యంగా ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో నేరస్తులకు చుక్కలు చూపించిన ఎస్పీగా ఆయనకు పేరు ఉంది.