/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహ మూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ అయోధ్య నగర్ క్షత్రియ భవన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత ఏడాది స్నేహితుడిని హత్య చేసిన కేసులో నరసింహ మూర్తి రాజు నిందితుడిగా ఉన్నారు. ఈ హత్య కేసులో కొద్ది రోజుల క్రితం ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా.. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ.. మూడు రాష్ట్రాల్లో ఆదిత్య పార్మసిని నరసింహమూర్తి రాజు విస్తరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మెడిసిన్స్ పై డిస్కౌంట్స్ ఇస్తూ.. వినియోగదారులను ఆకట్టుకున్నారు.