Trump Effect: పెద్దన్న నిర్ణయానికి ..ఏపీలో ఆక్వారంగం కుదేలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీలోని ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రొయ్యలపై దిగుమతి సుంకాన్ని అమెరికా పెంచబోతోందంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఏపీలో రొయ్యల కొనుగోళ్లు నిలిచిపోయాయి.

New Update
aqua

aqua

అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందనేది ఓ సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచ దేశాలలో పెద్దన్నలాంటి అమెరికా తీసుకునే ఏ నిర్ణయమైనా.. ఇతర దేశాలపై ప్రభావం చూపనుంది. మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన నిర్ణయాలు అయితే.. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల మీద కూడా ప్రభావం చూపిస్తాయని సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. పాలనాపరంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల ప్రభావం ప్రపంచ దేశాల మొత్తం మీద పడుతోంది. ఈ పరిణామాలను అందరూ గమనిస్తూనే ఉన్నారు. 

Also Read: malla reddy college: క్రికెట్ ఆడుతూ గ్రౌండ్‌లోనే మల్లారెడ్డి కాలేజీ స్టూడెంట్ మృతి.. వీడియో వైరల్

అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఏపీలోని ఆక్వారైతులు ఇబ్బందులు పడుతున్నారు. అదేంటీ.. ఏపీలోని రైతులకు, అమెరికా అధ్యక్షుడికి సంబంధం ఏమిటనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు సంగతి..ఏపీలోని ఆక్వా రంగంపై  ట్రంప్‌ రూపంలో పిడుగు పడింది. రొయ్యలపై దిగుమతి సుంకాన్ని పెంచే ఆలోచనలో అమెరికా ఉన్నట్లు వార్తలు రావటంతో ఏపీలో రొయ్యల కొనుగోళ్లు ఆగిపోయాయి. రొయ్యలపై ప్రస్తుతం 3 నుంచి 4 శాతంగా ఉన్న సుంకాన్ని .. అమెరికా 26 శాతానికి పెంచినట్లు వార్తలు రావటంతో ఏపీలో చాలా చోట్ల రొయ్యల కొనుగోళ్లు పూర్తిగా స్తంభించిపోయాయి.

Also Read: Uttam Kumar Reddy: సన్నబియ్యం పంపిణీలో తేడా జరిగితే.. ఉత్తమ్ హెచ్చరిక

కొత్త సుంకాలను అమెరికా అమలులోకి తీసుకుని వస్తే... అమెరికాకు ఇక్కడి నుంచి రొయ్యలను ఎగుమతి చేయాలంటే భారీగా పన్నులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు లక్ష రూపాయలు విలువ చేసే రొయ్యలు ఎగుమతి చేయాలంటే రూ.26వేలు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుది. దీనికి అదనంగా రవాణా, ప్యాకింగ్‌ ఖర్చులు కూడా ఉంటాయి.అమెరికాలో రొయ్యలపై సుంకాన్ని పెంచారనే వార్తలతో రొయ్యల కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రొయ్యల ధరలు తగ్గుతూ.. ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకుముందు 100 కౌంట్‌ ధర రూ.230 వరకు ఉండగా.. ప్రస్తుతం ఈ ధర రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గిపోయింది.

దీంతో రొయ్యలను సాగుచేస్తున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఓ పక్క వ్యాధులు, మరోపక్క పెట్టుబడి ఖర్చులతో కష్టాల్లో ఉన్న ఆక్వా రంగానికి అమెరికా నిర్ణయం కోలుకులేని దెబ్బే అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏపీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే రొయ్యలు వంటి ఆక్వా ఉత్పత్తులు అధికంగా ఎగుమతి అవుతున్నాయి. తాజా నిర్ణయంతో ఆ జిల్లాలోని ఆక్వారైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Also Read:  TS: ఉత్తమ విద్యావస్థ కోసం కొత్త పాలసీ..సీఎం రేవంత్ రెడ్డి

Also Read: IPL 2025: ఐపీఎల్‌లో అతనుంటే చాలు.. ఏ ఆర్డర్‌లో వస్తే ఏంటి? గేల్ కామెంట్స్ వైరల్!

 america | trump | trump tariffs | trump tariffs india | trump tariffs news | trump tariffs on india | donald trump tariffs | latest-news | ap telugu news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు