TS: ఉత్తమ విద్యావస్థ కోసం కొత్త పాలసీ..సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఉత్తమ విద్యావస్థ రూపకల్పన కోసం నూతన పాలసీని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ఆదేశించారు. క్షేత్రస్థాయిని దృష్టిలో పెట్టకుని దీనిని తయారు చేయాలని చెప్పారు. 

New Update
 CM Revanth Reddy

CM Revanth Reddy

విద్యా కమిషన్, విద్యాశాఖపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక విద్యస్థాయిలో ఎలాంటి సంస్కరణలు అవసరమన్నదానిపై అధికారులతో చర్చలు జరిపారు. ఇందులో భాగ్గా ఉత్తమ విద్య వ్యవస్థ కోసం కొత్త పాలసీలను తయారు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా వీటిని రూపొందించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారో అన్నదానిపై విద్యాశాఖ కమిషన్‌ ఛైర్మన్‌ ఆకునూరి మురళి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

ప్రజల జీవన ప్రమాణం పెరిగేలా..

తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలు మరింత బాగుపడాలని...అందుకు తగ్గట్టుగా విద్యావిధానం మారాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భాషతో పాటూ, విషయ పరిజ్ఞానం పెరిగేలా పాలసీని తయారు చేయాలని చెప్పారు. దీని కోసం అవసరమయ్యే ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం రెడీ గా ఉందని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జయప్రకాశ్‌ నారాయణ పలు కీలక సూచనలు చేశారు. విద్యా వ్యవస్థలో 1960 నుంచి చోటు చేసుకున్న మార్పులు ఏవిధంగా నష్టం కలిగించాయో వివరించారు. బోధన ప్రమాణాలు ఏవిధంగా ఉండాలన్న దానిపై పలు సూచనలు చేశారు. 

today-latest-news-in-telugu | telangana | cm-revanth-reddy | education | review-meeting

Advertisment
తాజా కథనాలు