IPL 2025: ఐపీఎల్‌లో అతనుంటే చాలు.. ఏ ఆర్డర్‌లో వస్తే ఏంటి? గేల్ కామెంట్స్ వైరల్!

ధోనీపై వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌లో అతనుంటే చాలు. ఏ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన నో ప్రాబ్లమ్. ధోనీ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకాలని ఎవరూ కోరుకోవద్దని సూచించాడు. భారత యువప్లేయర్లపై కూడా ప్రశంసలు కురిపించాడు. 

New Update
gayle

Chris Gayle interesting comments on Dhoni

IPL 2025: ఐపీఎల్‌లో రికార్డుల మోత మోగించిన క్రిస్ గేల్ ఈ సీజన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత క్రికెటర్లకు తాను ఇచ్చే రేటింగ్‌ ఏంటో కూడా చెప్పేశాడు. అలాగే CSK కు ఆడుతున్న ధోనీ ఐపీఎల్‌కు ఎంతో విలువ తీసుకొచ్చాడని చెప్పాడు. ఈ మేరకు ధోనీతోనే ఐపీఎల్‌కు క్రేజ్, వ్యాల్యూ పెరుగుతుందన్నాడు. అతడు ఎంతకాలం ఆడగలిగితే అంతకాలం ఆడించాలని, ధోనీ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకాలని ఎవరూ కోరుకోవద్దని సూచించాడు. 

టోర్నీ కల తప్పుతుంది..

ధోనిది గొప్ప వ్యక్తిత్వం. చెన్నై జట్టును ఎన్నోసార్లు ఛాంపియన్‌గా నిలిపిన అతను ఒకవేళ ఐపీఎల్‌ నుంచి వైదొలిగితే టోర్నీ కల తప్పుతుంది. సీఎస్ కే ఫ్రాంచైజీ కోసం ఎంతో చేశాడు. అతనుంటే చాలు ఎక్కడైనా అభిమానులు భారీగా తరలి వస్తారు. ఇలాంటి పవర్‌ కలిగిన వ్యక్తితో ఐపీఎల్‌ విలువ పెరుగుతుంది. అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యం చాలా అద్భుతం. ప్రతిఒక్కరూ ధోనీ స్కిల్స్‌ను చూడాలని ఆరాటపడతారు. ధోనీ 11వ నంబర్‌లో బ్యాటింగ్ కు వచ్చినా నో ప్రాబ్లమ్' అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా కొత్త కోట సీతా దయాకర్ రెడ్డి ...మరో ఆరుగురు కూడా...

ఇక టీమ్ ఇండయా క్రికెటర్లకు రేటింగ్‌ కూడా ఇచ్చాడు గేల్. రుతురాజ్‌కు 7, జైస్వాల్‌ 9, శుభ్‌మన్‌ గిల్‌ 9,  అభిషేక్ శర్మకు 8, కేఎల్ రాహుల్‌ 8, సూర్యకుమార్ 9, హార్దిక్‌ పాండ్య 7, శ్రేయస్ అయ్యర్ 8, రిషభ్‌ పంత్‌కు 8వ ర్యాంకు ఇస్తానని చెప్పాడు. ఈ యువ క్రికెటర్లంతా గొప్ప ఆటగాళ్లు అవుతారని జోష్యం చెప్పాడు. 

Also Read: దేశ భూభాగంలో 5% భూమి వక్ఫ్ బోర్డులదే.. 12వ శతాబ్దంలో మొదలై ఇప్పుడు 39లక్షల ఎకరాలు

chris-gayle | dhoni | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు