Uttam Kumar Reddy: సన్నబియ్యం పంపిణీలో తేడా జరిగితే.. ఉత్తమ్ హెచ్చరిక
సన్నబియ్యం పంపిణీపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని మంత్రి ఉత్తమ్ అన్నారు. దీనివల్ల 80 శాతం మంది పేదలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీలో ఏదైనా తేడా జరిగితే కఠినంగా చర్యలు తీసుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులను హెచ్చరించారు.
సన్నబియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకానికి సంబంధించి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు. దీనివల్ల 80 శాతం మంది పేదలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో శుక్రవారం ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సన్నబియ్యం పంపిణీపై సమీక్షించారు. లబ్ధిదారుల ఇళ్లల్లోకి వెళ్లి ప్రజాప్రతినిధులు భోజనం చేయాలని సూచించారు.
శ్రీరామనవమి రోజున భద్రాచంలో ఓ లబ్ధిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండొద్దని చెప్పారు. ఏదైనా తేడా జరిగితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రజాప్రతినిధులందరూ రేషన్ దుకాణాలను సందర్శించాలని కోరారు.
ఇదిలాఉండగా ఇటీవల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో దీన్ని ప్రారంభించారు. అలాగే దాదాపు 10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలిపారు.

Uttam Kumar Reddy

Also Read: తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా కొత్త కోట సీతా దయాకర్ రెడ్డి ...మరో ఆరుగురు కూడా...
శ్రీరామనవమి రోజున భద్రాచంలో ఓ లబ్ధిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండొద్దని చెప్పారు. ఏదైనా తేడా జరిగితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రజాప్రతినిధులందరూ రేషన్ దుకాణాలను సందర్శించాలని కోరారు.
Also Read: కంచ గచ్చిబౌలి భూములపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలు.. ఎంట్రీకి పూర్తి నిషేధం!
ఇదిలాఉండగా ఇటీవల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో దీన్ని ప్రారంభించారు. అలాగే దాదాపు 10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలిపారు.
Also Read: దేశ భూభాగంలో 5% భూమి వక్ఫ్ బోర్డులదే.. 12వ శతాబ్దంలో మొదలై ఇప్పుడు 39లక్షల ఎకరాలు
telugu-news | rtv-news | uttam-kumar