Kuppam: కుప్పంలో చంద్రబాబు ఫ్యామిలీ గృహ ప్రవేశం - PHOTOS
టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గృహప్రవేశ వేడుకలు కుప్పంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు దంపతులు, ఆయన కుమారుడు నారా లోకేష్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గృహప్రవేశ వేడుకలు కుప్పంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు దంపతులు, ఆయన కుమారుడు నారా లోకేష్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యాపారి వద్ద రూ.25 వేలు అప్పు తీసుకున్న కుటుంబంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో అప్పిచ్చిన వ్యక్తి ఆ బాలుడిని తమిళనాడులో రహస్యంగా పాతిపెట్టారు. పూర్తి సమాచారం కోసం టైటిల్పై క్లిక్ చేయండి.
పలమనేరులోని టీటీడీ గోశాలను చైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు ఆకస్మికంగా పరిశీలించారు. అపరిశుభ్రత, నిర్వహణ లోపాలు ఉన్నట్లు గుర్తించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. గోశాల నిర్వహణపై వారంలోపు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
కుప్పంలో ఘనంగా జరుగుతున్న ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో సీఎం చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు. అమ్మవారికి లాంఛనాలతో సారె సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో తిరుపతి, నెల్లూరు, యానం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో నిజమాబాద్, మహబూబ్నగర్లో భారీగా వర్షాలు పడతాయి.
ఆంధ్రప్రదేశ్లోని రెండు జిల్లాలో విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. చిత్తూరు జిల్లాలో మురికినీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, విజయనగరం జిల్లాలో కారులో చిక్కుకుని నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
తిరుమలో రద్దీ కొనసాగుతోంది.పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు ఎక్కువగా ఉండడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసి, బ్రేక్ దర్శనం వేళలను మార్చింది. దీంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం లభిస్తోంది.
ఏపీ, తెలంణాలో గాలులు, పిడుగులతో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటితో పాటు యానాం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో కూడా కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళంపేటలో ఉన్న అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి 27.98 ఎకరాలను కబ్జా చేసినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు.