AP Crime: తిరుమల ఘాట్‌లో రోడ్డు ప్రమాదం..మహిళ మృతి

తిరుమల ఘాట్‌ రోడ్డులో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో 24వ మలుపు వద్ద బస్సు బైక్‌ను ఢీకొని అరీఫా అనే మహిళ మృతి చెందగా.. ఆమె భర్త సురేష్‌, కుమారుడు షామీర్‌ సురక్షితంగా బయటపడ్డారు.

New Update
ttd crime news

AP Crime:

AP Crime: తిరుమల ఘాట్‌ రోడ్డులో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న ముగ్గురికి ఈ దుర్ఘటన ఎదురైంది. డౌన్ ఘాట్‌ రోడ్డులోని 24వ మలుపు వద్ద బస్సు ఒక ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ  అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలిని అరీఫా (32)గా గుర్తించారు. ఆమె భర్త సురేష్‌, కుమారుడు షామీర్‌ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వారంతా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

24వ మలుపు వద్ద ప్రమాదం..

ఘాట్‌ రోడ్డులో వాహనాల రద్దీ వల్ల24వ మలుపు వద్ద తిరుచానూరు నుంచి తిరుమలకు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి.. ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టంతో బైక్‌పై ఉన్న వీరు ఎగిరి రోడ్డుపక్కన పడ్డారు. దాంతో అరీఫా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి:రాత్రి పడుకునే ముందు పాలు తాగుతున్నారా..? దాని దుష్ప్రభావాలు ఇవే

 డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రమాద సమయంలో ఘాట్‌ రోడ్డులో మరెద్దన్న కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ఘాట్‌ రోడ్డులో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మృతురాలి కుటుంబసభ్యులు మరణ వార్త విని ఇతర బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఘట్‌ రోడ్లలో వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు అత్యంత జాగ్రత్త వహించాలని  శ్రీవారి భక్తులు కోరుతున్నారు. ప్రాణాలు తీసే ఈ రకమైన సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  

ఇది కూడా చదవండి:నిమ్మకాయ నీటిలో నల్ల ఉప్పు కలిపి తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

( AP Crime | ap crime latest updates | ap crime updates | ap-crime-news | ap-crime-report | Latest News )

Advertisment
తాజా కథనాలు