AP: ఏపీలో విషాదం.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యలు!
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత రాష్ట్రంలో విషాదకర ఘటనలు వెలుగులోకి వచ్చాయి.ఫెయిలయ్యామనే మనస్తాపంతో విశాఖ,నంద్యాల,నెల్లూరు జిల్లాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత రాష్ట్రంలో విషాదకర ఘటనలు వెలుగులోకి వచ్చాయి.ఫెయిలయ్యామనే మనస్తాపంతో విశాఖ,నంద్యాల,నెల్లూరు జిల్లాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం గ్రామంలో వరకట్నం కోసం వేధించడంతో ముగ్గులో వేసే రంగుని నీటిలో కలిపి తాగి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై భర్తతోపాటు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోసాని కృష్ణమురళికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న విచారణకు రావాలని పేర్కొన్నారు. పవన్, చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. దీంతో పోసాని మళ్లీ అరెస్ట్ అవుతారన్న చర్చ మొదలైంది.
అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఊరట నిచ్చేలా ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభం అయ్యాయి.ఈ క్రమంలో .ఏప్రిల్ నెలలోనూ విద్యార్థులకు బస్పాస్లను రెన్యువల్ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
అల్లూరు రైల్వే స్టేషన్, పడుగుపాడు రైల్వే స్టేషన్లల మధ్య వెళ్తున్న చండీగఢ్ - మదురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్టేషన్ కంటే ముందే రైలును ఆపేసి దోపిడీకి తెగబడ్డారు. S2, S4, S5కోచ్లలో కత్తులు చూపించి బంగారు నగలు, బ్యాగులను ఎత్తుకెళ్లారు.
మాజీ మంత్రి ,నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.క్వార్ట్జ్ అక్రమ మైనింగ్,రవాణా,నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను వినియోగించడం పై పొదలకూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. కోస్తాలో వేడిగాలులు సెగలు పుట్టిస్తున్నాయి.ప్రకాశం జిల్లా ,కడప,నంద్యాల,తిరుపతి, శ్రీకాకుళం వరకు మొత్తం 223 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.