Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్‌లోనే..!

నెల్లూరు జిల్లాలో ఏఎస్‌ పేట క్రాస్‌ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వెంకటరావుపల్లి నుంచి తెల్లపాడుకు పొగాకు గ్రేడింగ్‌ కోసం కూలీలు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

New Update
Road Accident chithoor

road accident Nellore

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వెంకటరావుపల్లి నుంచి తెల్లపాడుకు పొగాకు గ్రేడింగ్‌ కోసం ఆటోలో కూలీలు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏఎస్‌ పేట క్రాస్‌ రోడ్డు వద్ద ప్రమాద జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని వెంనటే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు

మహారాష్ట్రకు చెందిన వారు..

ఇదిలా ఉండగా ఇటీవల మహారాష్ట్రలోని నాందేడ్‌ కు చెందిన పెళ్లిబృందానికి జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి రుద్ర అక్కడికక్కడే మృతి చెందగా, వరుడితో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. వివరాల ప్రకారం నాందేడ్‌కు చెందిన యువకునికి కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది.

ఇది కూడా చూడండి: Curd: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!

ఈ క్రమంలో బుధవారం రాత్రి పెళ్లి బృందం నాందేడ్‌ నుంచి హుజురాబాద్‌ బయలుదేరింది. అయితే వారు ప్రయాణిస్తున్న కారును జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి రుద్ర మరణించగా పెళ్లికుమారుడితో పాటు ఆరుగురికి గాయాలయ్యాయి. కాగా క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Operation Kagar : చత్తీస్‌ గఢ్‌ రాష్ట్రం లో మరో భారీ ఎన్ కౌంటర్...అగ్రనేత మృతి ?

కాగా ప్రమాదంలో వరుడు గాయపడటంతో వివాహం ఆగిపోయింది. మరోవైపు చిన్నారి మృతితో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. ఘనంగా జరగాల్సిన పెళ్లి వాయిదా పడటంతో పెళ్లికి వచ్చిన బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు

Advertisment
Advertisment
తాజా కథనాలు