/rtv/media/media_files/2025/06/01/DLZEIdoJUtDV7K17kFiB.jpg)
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం బెస్తపాలెం వీధిలో శ్రీ కావమ్మ తల్లి ఉత్సవాల్లో అపశృతి చేటుచేసుకుంది. తిరునాళ్లు రెండవరోజులో భాగంగా శనివారం రాత్రి అమ్మవారిని పురవీధుల్లో ఉరేగిస్తున్నారు. ఈ సందర్భంగా పూజరి కావమ్మ తల్లికి దిష్టి తీశాడు. ఉత్సవ నిర్వాహకుడు గుర్రం శోభన్ బాబు హఠాత్మరణం చెందారు. గుమ్మడికాయ దిష్టి తీస్తూ తాండవం చేశారు. అనంతరం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కావమ్మ తల్లి అమ్మవారి గ్రామోత్సవం కార్యక్రమంలో ఓ భక్తుడు దిష్టి తీస్తూ చనిపోయాడు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకోగా దేవస్థానం నిర్వాహకుడు గుర్రం శోభన్‌బాబు గుమ్మడికాయతో నృత్యం చేస్తూ ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.… pic.twitter.com/NAcgnxzX4y
— RTV (@RTVnewsnetwork) June 1, 2025
శోభన్ బాబు అమ్మవారి ఊరేగింపు వాహనం ముందు తాండవం చేస్తూ అందరూ చూస్తుండగానే నేలకొరిగాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో నిర్వాహకుడు దిష్టి తీస్తూ తాండవం చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. స్థానికులు వెళ్లి చూసేసరికి స్పృహ కోల్పోయాడు. భక్తులు ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శోభన్ బాబు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఉత్సవ నిర్వహకుడు మృతితో తిరునాళ్లు ఆగిపోయాయి. అప్పటి వరకూ పండుగ వాతావరణం ఉన్న ఊరిలో ఒక్కసారిగా విషాదం కమ్ముకుంది. భక్తులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమైయ్యారు.
Nellore Kavamma Thalli festival | Shobhan Babu | nellore | viral-news | latest telugu news updates | dies suddenly | andhra-paradesh
Follow Us