/rtv/media/media_files/2025/06/01/vyk7ASVjgvhezBH65OeT.jpg)
kavali recording dance videos
ఆంధ్రప్రదేశ్‌లోసాధారణంగా ఏవైనా పండుగలు, పబ్బాలకు అక్కడక్కడ రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈ డాన్సులు ఒక్కోసారి శ్రుతిమించిపోతుంటాయి. చుట్టూ మహిళలు ఉన్నా.. స్టేజ్‌పై రెచ్చిపోయి డాన్స్‌లు చేస్తుంటారు. స్టేజ్‌పై ఉన్న మహిళలు నగ్న అవతారంలో కనిపించి కుర్రాళ్లలో హీట్ పెంచేస్తుంటారు.
Also Read : ‘కన్నప్ప’ హార్డ్ డిస్క్‌పై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
kavali recording dance videos
తాజాగా అలాంటి డ్యాన్స్ షో ఏపీలో మరోసారి కనిపించింది. నెల్లూరు జిల్లా కావలిలో అశ్లీల నృత్యాలు సంచలనంగా మారాయి. అది కూడా హనుమాన్ జయంతి సందర్భంగా రాములోరి గుడి ఎదురుగా ఈ నగ్నంగా రికార్డ్ డ్యాన్సులు దర్శనమిచ్చాయి. అల్లూరు మండలం శంభునిపాలెం టీడీపీ నాయకులు పురిణి రాజు, పురిణి వెంకటేశ్వరరావు, పురిణి వెంకటేశ్వర్లు రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
Also Read : ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా - పోలీస్ స్టేషన్ మెస్‌లోనే రేప్!
In a disturbing reflection of the moral collapse under the TDP-led coalition, vulgar and indecent dance performances were shamelessly organized in front of temples during Hanuman Jayanti in Shambunipalem village of Kavali constituency. Under the watch of MLA Kavya Krishna Reddy,… pic.twitter.com/SJJezMoB9z
— YSR Congress Party (@YSRCParty) May 31, 2025
దీనిపై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ వాగ్దానం చేసిన పాలన నమూనా ఇదేనా? వారు మాట్లాడే అభివృద్ధి ఇదేనా? అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ‘‘కావలి నియోజకవర్గంలోని శంబునిపాలెం గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా దేవాలయాల ముందు అసభ్యకరమైన నృత్య ప్రదర్శనలు సిగ్గులేకుండా నిర్వహించబడ్డాయి. ఎమ్మెల్యే కావ్య కృష్ణ రెడ్డి పర్యవేక్షణలో, ఇటువంటి నృత్య ప్రదర్శనలు అత్యంత దారుణం.
Also Read : ఇరాన్ లో ముగ్గురు ఇండియన్స్ కిడ్నాప్..పాకిస్తాన్ నంబర్ నుంచి డబ్బులు?
https://x.com/Telugufeedsite/status/1928705279606272010
Loading...
ఒకప్పుడు గౌరవనీయమైన బోధనా వృత్తి.. ఇప్పుడు అశ్లీలతకు స్పాన్సర్‌గా మారింది. యువతను హానికరమైన అలవాట్లలోకి నెట్టివేసింది. ఆశ్చర్యకరంగా ఈ అవమానకరమైన సంఘటనను ప్రశ్నించిన వారిపై భౌతికంగా దాడి చేశారు. చంద్రబాబు, లోకేష్ వాగ్దానం చేసిన పాలన నమూనా ఇదేనా? వారు మాట్లాడే అభివృద్ధి ఇదేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తోంది. తక్షణమే జవాబుదారీతనం, సామాజిక వ్యవస్థను విషపూరితం చేసినందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన నగ్న నృత్య వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read:ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?
ap-news | ycp | chandrababu