కడపలో దారుణ హత్య
సొంత అన్ననే హత్య చేసిన దారుణ ఘటన కడప జిల్లా మైదకూరులో చోటుచేసుకుంది. అప్పు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అది ముదరడంతో.. తమ్ముడు బాలరాజు అన్న నారాయణ యాదవ్‌ను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ప్రస్తుతం బాలరాజు పరారీలో ఉన్నాడు.
సొంత అన్ననే హత్య చేసిన దారుణ ఘటన కడప జిల్లా మైదకూరులో చోటుచేసుకుంది. అప్పు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అది ముదరడంతో.. తమ్ముడు బాలరాజు అన్న నారాయణ యాదవ్‌ను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ప్రస్తుతం బాలరాజు పరారీలో ఉన్నాడు.
వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం సుగాలిబిడికి ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌నకు గురైంది. ఉదయ్‌కిరణ్, మరో ఇద్దరు మైనర్లు కలిసి బాలికను లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
మేము అధికారంలో నుంచి దిగిపోయేనాటికి మొత్తం రూ.6 లక్షల 46 వేల కోట్ల అప్పులున్నాయని మాజీ సీఎం జగన్ అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల అప్పులని ఒకసారి,రూ.14 లక్షల కోట్ల అప్పులని మరోసారి అబద్ధాలు చెబుతోందంటూ విమర్శించారు.
ఏపీలో అదానీ క్యాంపుపై రాళ్ల దాడి జరిగింది. రాగిగుంటలో కొత్తగా నిర్మిస్తున్న పంపు స్టోరేజీ విద్యుత్ ప్లాంట్, సిబ్బందిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడిచేసి వాహనాల అద్దాలు పగలకొట్టారు. దీనిపై సీఎం చంద్రబాబు ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ కీలక నేత, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇదే కేసులో శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌కార్డులోని పుట్టిన తేదీ మార్పునకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆధార్‌లో పుట్టిన తేదీ మార్పు కోసం ప్రభుత్వ వైద్యులు అందించే వయస్సు ధ్రువీకరణ పత్రాలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
AP: మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రభుత్వ సలహాదారుడిగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి కీలక పదవి అప్పగించారు. వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ గా సజ్జలను జగన్ నియమించారు. ఈ మేరకు వైసీపీ ప్రకటన విడుదల చేసింది.
కడపలో నేడు అన్ని పాఠశాలలకు అధికారులు సెలవు ఇచ్చారు. పెద్ద దర్గా ఉత్సవాల నేపథ్యంలో అధికారులు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవును ఇచ్చినట్లు ప్రకటించారు.
AP: జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై షర్మిల విమర్శలు చేశారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదని.. సొంత మైకుల ముందు కాదు.. అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని అంటూ చురకలు అంటించారు. చిత్తశుద్ధి ఉంటే ప్రజాసమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలన్నారు.