ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు ఈజీ! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌కార్డులోని పుట్టిన తేదీ మార్పునకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆధార్‌లో పుట్టిన తేదీ మార్పు కోసం ప్రభుత్వ వైద్యులు అందించే వయస్సు ధ్రువీకరణ పత్రాలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. By Seetha Ram 18 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి ఆధార్ కార్డు.. ఈ పేరులోనే ఉంది.. ఎక్కడికి వెళ్లినా మనకంటూ ఒక ఆధారం ఉండాలని. అదే ఆధార్ కార్డు. మన దేశంలో ప్రభుత్వ పరంగా కానీ ప్రైయివేటు పరంగా కానీ ఏ పని జరగాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ పథకాలు అందాలంటే ఆధార్ కార్డు, రేషన్ దుకాణాల నుంచి సరుకులు కొనాలంటే ఆధార్ కార్డ్. ఇలా భారతీయులకు ఆధార్ కార్డ్ అనేది ఒక నిత్యవసరంగా మారిపోయింది. Also Read: మహారాష్ట్రలో పవన్ ప్రచారం..తెలుగు, హిందీ, మహారాష్ట్రల్లో ప్రసంగం ఆధార్ కార్డు తప్పని సరి గుడిలో దైవ దర్శనాల నుంచి మొదలు పెడితే.. మొబైల్ సిమ్ కొనేంత వరకు ఆధార్‌కార్డ్ తప్పనిసరి అనే చెప్పాలి. ఒక వేళ ఆధార్ కార్డ్ లేకుండా పని జరగాలని అనుకున్నారో అది మీ తరం కూడా కాదు. ఇలా ఆధార్ కార్డు పనిచేస్తుంది. అయితే ఆ ఆధార్ కార్డు నమోదు సమయంలో పుట్టిన రోజు తేది తప్పుగా పడిందంటే.. అది మార్చుకోవడానికి నానా తంటాలు పడాలి. Also Read: సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళనలు.. స్పందించిన ఆస్ట్రోనాట్ ఇది కాకుండా ఆధార్‌లో పుట్టిన తేదీ మార్చుకోవాలంటే స్టడీ సర్టిఫికేట్స్ లేదా బర్త్ సర్టిఫికేట్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇటీవల కాలంలో జన్మించిన వారికి ఇవన్నీ ఉంటాయ్. కానీ అప్పట్లో జన్మించిన వారికి ఇవేం ఉండవు. అందువల్ల ఆధార్‌లో బర్త్ డే డేట్ మార్చుకోవడం చాలా కష్టం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Also Read: రగులుతున్న మణిపూర్...కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష ప్రభుత్వం కీలక నిర్ణయం ఆధార్ కార్డులో పుట్టిన రోజు మార్పునకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆధార్‌లో బర్త్ డే డేట్ మార్పుకోసం గవర్నమెంట్ డాక్టర్స్ అందించే వయస్సు ధ్రువీకరణ పత్రాలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. Also Read: ఢిల్లీలో స్టేజ్ –4 ఆంక్షలు..మొత్తం అన్ని స్కూళ్ళు క్లోజ్ పుట్టిన తేదీ మర్పుకోసం పంచాయితీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు అందించే సర్టిఫికేట్ మాదిరిగానే గవర్నమెంట్ హాస్పిటల్‌లోని వైద్యులు అందించే వయస్సు ద్రువీకరణ పత్రాలను కూడా అనుమతించాలని ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అంతేకాకుండా ఆ సర్టిఫికేట్లపై క్యూ ఆర్ కోడ్ ఉండేటట్లు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మార్పు జరిగితే ఆధార్ కార్డుపై తప్పుగా పడిన తేదీ మర్చుకోవడం మరింత సులువు అవుతుందనే చెప్పుకోవాలి. #aadhaar-card #ap-government మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి