Bargav: సజ్జల భార్గవ్ అరెస్ట్ కు రంగం సిద్దం.. 41-A నోటీసులు జారీ

సోషల్ మీడియా అసభ్యకర పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవ్ రెడ్డికి 41-A నోటీసులు జారీ చేశారు పోలీసులు. మంగళగిరిలో భార్గవ్ తల్లికి పులివెందుల పోలీసులు నోటీసులు అందించారు. జగన్ బంధువు అర్జున్ రెడ్డికి సైతం 41-A నోటీసులు ఇచ్చారు.

author-image
By srinivas
New Update
ఆఇఆఇ

Bargav: సోషల్ మీడియా అసభ్యకర పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవ్ రెడ్డికి 41-A నోటీసులు జారీ చేశారు పోలీసులు. మంగళగిరిలో భార్గవ్ తల్లికి పులివెందుల పోలీసులు నోటీసులు అందించారు. జగన్ బంధువు అర్జున్ రెడ్డికి సైతం 41-A నోటీసులు ఇచ్చారు.

మరో 15 మందికి సైతం.. 


ఈ మేరకు వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం వీరికి 41A నోటీసులు జారీ చేశారు. సోమవారం  వీరితో పాటు మరికొంత మంది వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలకు విచారణకు హాజరు కావాలని సూచించారు నవంబర్ 8న ఐటీ, BNS, అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కాగా  A-1 వర్రా రవీందర్ రెడ్డి, A-2 సజ్జల భార్గవ్ రెడ్డి, A-3 అర్జున్ రెడ్డిపై కేసులు నమోదు  చేశారు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న వర్రా రవీందర్‌రెడ్డి కేసులో మరో 15 మందికి నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా పోస్టుల్లో సజ్జల భార్గవ్ రెడ్డి కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. 

ఇది కూడా చదవండి: అదానీకి బిగ్ షాక్.. 21 రోజుల తర్వాత ఇక అరెస్టేనా?

సజ్జల భార్గవ్ రెడ్డి 2022 లో వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు తీసుకున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై భార్గవ్ సూచనల మేరకే పోస్టులు పెట్టినట్లు వర్రా రవీందర్ రెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. వర్రా రవీందర్‌రెడ్డి పైన కడప జిల్లాలో 10, రాష్ట్రవ్యాప్తంగా 40 కేసులు నమోదయ్యాయి. 

ఇది కూడా చదవండి: Maharashtra CM: మహా సీఎంగా ఎవరూ ఊహించని వ్యక్తి.. BJP సంచలన వ్యూహం!

Advertisment