అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం! వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ కీలక నేత, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇదే కేసులో శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. By Nikhil 19 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ కీలక నేత, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇదే కేసులో శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. అవినాశ్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని వైఎస్ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. సునీత తరఫున సిద్దార్ధలూథ్ర వాదనలు వినిపించారు. Also Read: ఇంకా రాజధానిగా ఢిల్లీ అవసరమా..? జైలుకు వెళ్లి బెదిరింపులు.. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వ్యక్తిని శివశంకర్‌రెడ్డి కొడుకు జైలుకు వెళ్లి బెదిరించాడని ఆయన ధర్మాసనానికి తెలిపారు. ఓ ప్రైవేటు డాక్టర్‌గా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్తూ.. సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని లూథ్రా పేర్కొన్నారు. డాక్టర్ చైతన్య నిబంధనలకు విరుద్ధంగా జైలులోకి వెళ్లారని న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. ఆయన రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేసే డాక్టర్ కాదని తెలిపారు. Also Read: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి కారుపై రాళ్ళ దాడి.. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వాన్ని, డాక్టర్ చైతన్యను ప్రతివాదులుగా చేర్చాలని సునీత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇంకా వైఎస్ అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డి మర్డర్ కేసులో 8వ నిందితుడిగా ఉన్నారని సునీత కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయస్థానం ఎంపీ అవినాష్ రెడ్డి, శివశంకర్‌రెడ్డి కొడుకు చైతన్య రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది. Also Read: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం! తమపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని సునీత, రాజశేఖర్ రెడ్డి, సీబీఐ విచారణ అధికారి రాంసింగ్ దాఖలు చేసిన పిటిషన్లపై సైతం విచారణ జరిగింది. వివేకా హత్య కేసు పరిణామాలను న్యాయస్థానానికి లూథ్రా వివరించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చ్ 3కు వాయిదా వేసింది న్యాయస్థానం. దర్యాప్తు అధికారిపై ప్రైవేట్ కంప్లైంట్ తో విచారణను అడ్డుకున్నారని లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసును రూపు మాపాలనే ప్రయత్నం చేశారని వివరించారు. Also Read: కోలకత్తా నిందితుడిని తీసుకురావడంలో పోలీసుల కొత్త టెక్నిక్.. #ys-vivekananda-reddy #murder-case #supreme-court #avinash-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి