ఆ వీడియో చూపించి బాలికపై అత్యాచారం.. చివరికి ఏం జరిగిందంటే? వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం సుగాలిబిడికి ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌నకు గురైంది. ఉదయ్‌కిరణ్, మరో ఇద్దరు మైనర్‌లు కలిసి బాలికను లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. By Seetha Ram 22 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి అభం సుభం తెలియని బాలికపై కొందరు మైనర్లు రెచ్చిపోయారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. ఏకంగా ముగ్గురు కలిసి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ వీడియో చూపించి బాలికను లొంగదీసుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెప్పొద్దని బెదిరించారు. చివరికి తెగించి ఆ బాలిక కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read: అదానీకి వరుసగా షాక్‌లు..కెన్యా ఒప్పందాలు రద్దు ఆ వీడియో బాలికకు చూపించి వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం సుగాలిబిడికి ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక తన ఇంటి సమీపంలో ఓ యువకునితో ఒంటరిగా మాట్లాడింది. అది గమనించిన కొందరు మైనర్లు సెల్‌ఫోన్లో రికార్డ్ చేశారు. ఆ వీడియో బాలికకు చూపించి ఉదయ్ కిరణ్ సహా మరో ఇద్దరు మైనర్లు ఆ బాలికను లొంగదీసుకున్నారు. Also Read: హిట్ మ్యాన్, టీమ్ ఇండియా కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజులవుతోంది. కానీ ఆ మైనర్ నిందితులంతా రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న వ్యక్తుల కొడుకులు కావడంతో ఈ విషయం గుట్టు చప్పుడు కాకుండా ఉంది. మొదటిగా వారు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆ ఫ్యామిలీతో బేరసారాలు ఆడినట్లు సమాచారం. వారు ఒప్పుకోకపోవడంతో వారిని బెదిరించినట్లు తెలిసింది. Also Read: ఐదు బ్యాంకుల మీద కొరడా ఝళిపించిన ఆర్బీఐ..భారీ జరిమానా ఇక లాభం లేదని బాధితురాలి తండ్రి కడపలోని ‘దిశ’ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కడప డీఎస్పీ వెంకటేశ్వరులు, దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమాకాంత్‌లు విచారణ మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు నిందితులపై చింతకొమ్మదిన్నె సీఐ శంకర్ నాయక్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. Also Read: రేవంత్ ప్రభుత్వానికి షాక్..సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ #kadapa #crime-news #ap-crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి