Kadapa: విద్యార్థులకు గుడ్ న్యూస్...నేడు పాఠశాలలకు సెలవు!
కడపలో నేడు అన్ని పాఠశాలలకు అధికారులు సెలవు ఇచ్చారు. పెద్ద దర్గా ఉత్సవాల నేపథ్యంలో అధికారులు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవును ఇచ్చినట్లు ప్రకటించారు.
కడపలో నేడు అన్ని పాఠశాలలకు అధికారులు సెలవు ఇచ్చారు. పెద్ద దర్గా ఉత్సవాల నేపథ్యంలో అధికారులు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవును ఇచ్చినట్లు ప్రకటించారు.
AP: జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై షర్మిల విమర్శలు చేశారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదని.. సొంత మైకుల ముందు కాదు.. అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని అంటూ చురకలు అంటించారు. చిత్తశుద్ధి ఉంటే ప్రజాసమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలన్నారు.
AP: సజ్జల భార్గవ్‌తో పాటు వర్రా రవీంద్రారెడ్డి, అర్జున్ రెడ్డిలపై మరో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. పవన్‌పై అసభ్యకర పోస్టులు తొలగించాలని కోరగా కులం పేరుతో తనను దూషించారని జనసేన కార్యకర్త వెంకటాద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
AP: చంద్రబాబపై జగన్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో చంద్రబాబు ఎగ్గొట్టారని అన్నారు. 'నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?', నీపై 420కేసు ఎందుకు పెట్టకూడదు.' అని చంద్రబాబును నిలదీశారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కడప పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డితో పాటూ మరి కొందరిపై వీటిని జారీ చేశారు. భార్గవ రెడ్డి మీద ఇప్పటికే పలు క్రిమినల్ కసులు నమోదయ్యాయి.
AP: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సీజేఐ ధర్మాసనం మరో బెంచ్‌కు మార్చింది. కాగా జగన్ బెయిల్ రద్దు చేయాలని RRR సుప్రీంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఇవాళ ఒక్కరోజే ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై ఒక కారు వేగంగా వచ్చి చెట్టును ఢికొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. కడప చెన్నై హైవేపై కారు-స్కూటర్ ఢీకొనడంతో ఇద్దరు మృతి.. జగిత్యాల సమీపంలో లగ్జరీబస్సు కారును ఢీకొట్టడంతో ఇద్దరుమృతి చెందారు.
AP: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు భార్గవ్ పై కేసు నమోదైంది. అధికార పార్టీ నేతలే టార్గెట్‌గా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలతో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.