ఏపీలో ఉద్రిక్తత.. అదానీ క్యాంపుపై ఎమ్మెల్యే వర్గీయుల రాళ్ల దాడి! ఏపీలో అదానీ క్యాంపుపై రాళ్ల దాడి జరిగింది. రాగిగుంటలో కొత్తగా నిర్మిస్తున్న పంపు స్టోరేజీ విద్యుత్ ప్లాంట్, సిబ్బందిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడిచేసి వాహనాల అద్దాలు పగలకొట్టారు. దీనిపై సీఎం చంద్రబాబు ఫైర్ అయినట్లు తెలుస్తోంది. By srinivas 20 Nov 2024 | నవీకరించబడింది పై 20 Nov 2024 14:10 IST in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి AP News: ఏపీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జమ్మలమడుగు నియోజకవర్గం రాగిగుంట గ్రామంలోని అదానీ క్యాంపుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు, కుటుంబసభ్యులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కంపెనీ క్యాంపు, సిబ్బందిపై దాడిచేసి అద్దాలు పగలకొట్టారు. వాహనాలు, యంత్రాలను ధ్వంసం చేశారు. తమ ఎమ్మెల్యేకు చెప్పకుండా పనులెలా మొదలుపెడతారంటూ ఆదినారాయణరెడ్డి కుటుంబసభ్యులు శివనారాయణరెడ్డి, రాజేశ్‌రెడ్డిలు తమ అనుచరులతో కలిసి పంప్ షెడ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు తాళ్ల ప్రొద్దుటూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేమగా కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై రుషికేశ్వర్‌రెడ్డి తెలిపారు. 1000 మెగావాట్ల సామర్థ్యంతో పంపు స్టోరేజీ.. ఈ మేరకు రాగిగుంట వద్ద 470 ఎకరాల విస్తీర్ణంలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో పంపు స్టోరేజీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ఆధాన్ సంస్థ ప్రారంభించింది. ఇందులో భాగంగానే క్యాంపు ఏర్పాటు చేసుకొని యంత్రాలతో నీళ్ల చదును పనులు మొదలుపెట్టింది. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు శివనారాయణరెడ్డి, రాజేశ్‌రెడ్డి తమ అనుచరులను వెంటపెట్టుకుని వచ్చి అదానీ సంస్థ ప్రతినిధులతో గొడవకు దిగారు. తమకు సమాచారం ఇవ్వకుండా పనులు ఎందుకు ప్రారంభించారంటూ సిబ్బందితో గొడవపడి.. ఆ తర్వాత రాళ్లతో దాడి చేశారు. అయితే డబ్బుల కోసమే ఈ దాడికి తెగపడ్డారని అదానీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: నిండా ముంచిన సువర్ణ భూమి.. లాభాల ఆశ చూపి రూ.200 కోట్లు స్వాహా! చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. అయితే ఈ దాడిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యవహారం గురించి ఆరా తీసిన బాబు.. ఆదినారాయణరెడ్డి ఫ్యామిలీని సీఎంవోకు పిలిపించి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి, ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తుంటే పారిశ్రామికవేత్తలను బెదిరించడం ఏమిటంటూ మందలించినట్లు సమాచారం. ఇది కూడా చదవండి: అగ్రస్థానంలో హైదరాబాద్.. ఢిల్లీ, ముంబైని మించి ఆర్థికాభివృద్ధి! ఇదిలా ఉంటే.. స్థానికులకు ఉద్యోగాలివ్వడంతోపాటు తమ వాహనాలను అద్దెకు తీసుకోవాలని అడగడానికి వెళ్లినట్లు ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నారు. దీనిపై అదానీ సంస్థ ప్రతినిధులు బీజేపీ, కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ నియోజకవర్గ పరిధిలో సిమెంట్ కర్మాగారాలు, జిందాల్ సంస్థకు చెందిన పరిశ్రమలున్నాయి. Also Read: Holidays: విద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లకు 4 రోజులు సెలవులే సెలవులు! Also Read: TG-TET: నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు #adani camp office #jammalamadugu #adinarayana-reddy #mla #adani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి