అదానీ వ్యవహారంలో జగన్ కు బిగ్ షాక్.. రంగంలోకి ఏసీబీ?

అదానీ సంస్థ అవినీతి వ్యవహారంలో వైఎస్‌ జగన్‌ కు బిగ్ షాక్ తగిలింది. జగన్ కు అదానీ సంస్థ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు సెంటర్‌ ఫర్‌ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నలమోతుచక్రవర్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

author-image
By srinivas
New Update
Jaganmohan Reddy, Gautam Adani

YS Jagan: అదానీ సంస్థ అవినీతి వ్యవహారంలో వైఎస్‌ జగన్‌ కు బిగ్ షాక్ తగిలింది. జగన్ కు అదానీ సంస్థ భారీ లంచం ఇచ్చినట్లు సెంటర్‌ ఫర్‌ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నలమోతుచక్రవర్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అదానీ.. జగన్ కు రూ.1,750 కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీ విచారణలో తేలినట్లు ఫిర్యాదులో చక్రవర్తి పేర్కొన్నారు. అంతేకాదు అదానీ కంపెనీ సోలార్ పవర్ అగ్రిమెంట్ పై విచారణ జరిపి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

8 మందిపై కేసు నమోదు..

ఇదిలా ఉంటే.. అదానీ, జగన్ అమెరికా కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యవహారంపై దర్యాప్తు కోరుతూ విశాల్ తివారీ పిటిషన్ వేశారు. ఇండియాలో సోలార్ ఎనర్జీ అగ్రిమెంట్ కోసం అదానీ గ్రూపు రూ. 2,029 కోట్లు లంచం ఇచ్చినట్లు అమెరికాలో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా మొత్తం 8 మందిపై కేసు నమోదైంది. 

ఇది కూడా చదవండి: కుల గణనపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన!

2021-24 మధ్య కాలంలో అప్పటి ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంతో పాటు మరో 5 రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులకు రూ. 2,029 కోట్లు అదానీ లంచం ఇచ్చినట్లు అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ప్రకటించింది. అందులో రూ. 1750 కోట్లు ఏపీ ప్రభుత్వ వ్యక్తికి చెల్లించినట్లు వెల్లడించింది. 

ఇది కూడా చదవండి: కేకేఆర్ కెప్టెన్ గా భారత సీనియర్ ప్లేయర్.. రూ.1.75 కోట్లకే పగ్గాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు