రాష్ట్ర అప్పులపై జగన్ సంచలన కామెంట్స్‌..

మేము అధికారంలో నుంచి దిగిపోయేనాటికి మొత్తం రూ.6 లక్షల 46 వేల కోట్ల అప్పులున్నాయని మాజీ సీఎం జగన్ అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల అప్పులని ఒకసారి,రూ.14 లక్షల కోట్ల అప్పులని మరోసారి అబద్ధాలు చెబుతోందంటూ విమర్శించారు.

New Update
hhg

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వ పలు బిల్లులను కూడా ఆమోదం తెలిపింది. అయితే తాజాగా మాజీ సీఎం జగన్‌ రాష్ట్ర అప్పుల గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. '' 2019లో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయేనాటికి రాష్ట్ర అప్పులు రూ.2 లక్షల 57 వేల కోట్లు. 2019 నాటికి ప్రభుత్వం గ్యారెంటీగా ఉన్న అప్పులు రూ.55 వేల కోట్లు. మొత్తం కలిపి రూ.3 లక్షల 13 వేల కోట్ల అప్పులు. మేము అధికారం నుంచి దిగిపోయేనాటికి రూ.4 లక్షల 91 వేల కోట్ల అప్పులు ఉన్నాయి.

Also Read: అప్పటి వరకు చంద్రబాబే సీఎం.. పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు రూ.లక్షా 54 వేల కోట్లు. మొత్తం కలిపి రూ.6 లక్షల 46 వేల కోట్ల అప్పులు. 2023-2024 కాగ్‌ రిపోర్టులు కూడా రూ.6 లక్షల 46 వేల కోట్ల అప్పులని చెప్పింది. రాష్ట్రంలో రూ.12 లక్షల కోట్లు అప్పులని ఒకసారి.. రూ.14 లక్షల కోట్ల అప్పులని మరోసారి అబద్ధాలు చెప్పారు. తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా ?. తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు వ్యవస్థీకృతం చేశారు. చంద్రబాబు అబద్ధాలు ఇంకా కొనసాగుతున్నాయి. రూ.42 వేల 183 కోట్ల బకాయిలు చంద్రబాబు మాకు గిఫ్ట్‌గా ఇచ్చి వెళ్లారు. ఐదేళ్ల బాబు హయాంలో FRBM పరిధి దాటి రూ.28 వేల 457 కోట్లు అప్పులు చేశారు. మా హయాంలో FRBM పరిధి దాటి రూ.16 వందల 47 కోట్లు మాత్రమే అప్పులు చేశాం.

ఎవరి హయాంలో అప్పులు ఎక్కువయ్యాయే లెక్కలే చెబుతున్నాయి.ఎవరు ఆర్థిక విధ్వంసకారులో ఈ లెక్కలే సాక్ష్యం. ప్రభుత్వ రంగ సంస్థలు చేసే అప్పులు ప్రభుత్వ ఖాతాల్లోకి రావు. ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు కలుపుకున్నా మా హయాంలోనే తక్కువగా అప్పులు అయ్యాయి. అందరూ కలిసి అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు. మీ లెక్కలను మీరే ఒప్పుకోకపోతే బడ్జెట్‌ను ఎందుకు పెట్టినట్లు ?. బడ్జెట్‌లో ఒకటి చెప్పి బయట మరొకటి చెబుతున్నారు. బొంకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదని'' జగన్ అన్నారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు