గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

హర్యానాలోని జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటన గురించి తెలిసిందే. తాజాగా దీనిపై వర్సిటీ యాజమాన్యం స్పందించింది. విద్యార్థినులు సరదాగా ప్రాంక్ చేశారని స్పష్టం చేసింది.

New Update
Jindal university responds after girl caught sneaking into boys' hostel in suitcase

Jindal university responds after girl caught sneaking into boys' hostel in suitcase

హర్యానాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటన గురించి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై యూనివర్సిటీ అధికారులు స్పందించారు. అమ్మాయిని బాయ్స్‌ హాస్టల్‌కు తీసుకొచ్చారని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. యూనివర్సిటీ హాస్టల్‌లో కొందరు విద్యార్థినులు సరదాగా ప్రాంక్ చేసినట్లు చెప్పారు. 

Also Read: మూడే మూడు పెగ్గులు.. సైకిల్‌తో రోడ్‌రోలర్‌ను ఈడ్చుకుంటూ- రయ్ రయ్

దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణ చేశారని.. కొందరు విద్యార్థినులు సరదాగా ఈ పని చేసినట్లు తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. తోటి స్నేహితులు ఒక అమ్మాయిని సూట్‌కేసులో కూర్చోబెట్టి క్యాంపస్‌లో గ్రౌండ్‌కి, మేడ మీదకి తీసుకెళ్లారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వాళ్లని గమనించి ఆపారు. సూట్‌కేస్ తెరవగా అందులో నుంచి అమ్మాయి వచ్చింది. ఈ వీడియో బయటకు వెళ్లడంతో దీన్ని తప్పుగా చిత్రీకరించారు. ఇలా చేసిన విద్యార్థులకు వర్సిటీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసిందని'' తెలిపారు.

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ఇదిలాఉండగా.. జిందాల్ వర్సిటీకి చెందిన ఓ విద్యార్థి సూట్‌కేసులో ఓ అమ్మాయిని కూర్చోబెట్టి బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. అక్కడున్న సిబ్బంది ఆ సూట్‌కేస్ తెరవగా అందులో నుంచి అమ్మాయి బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేశారు. దీంతో తాజాగా దీనిపై స్పందించిన వర్సిటీ యాజమాన్యం ఇదంతా ప్రాంక్ అని స్పష్టం చేసింది. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

 telugu-news | rtv-news | haryana | national-news 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు