Heatwave Warning : బయటకు వెళ్తున్నారా? జాగ్రత్త...ఈ రోజు మండనున్న ఎండలు..అరెంజ్ అలర్ట్
ఒకవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోవాతావరణం బెంబేలెత్తిస్తుంది. ఉదయమంతా వడగాల్పులతో సతమతమవుతుంటే, సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు కూడా వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Ap Weather Report: ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో వర్షాలు.!
ఏపీలోవాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు!
ఆంధ్రప్రదేశ్లో గురువారం పలు జిల్లాలలో వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురు, శుక్రవారం పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది
Ap Weather Report: ఆ జిల్లాలలో పిడుగులతో భారీ వర్షాలు.. మరో మూడు రోజులు ఇంతే..
ఏపీలో మరో మూడు రోజులు విభిన్న వాతావరణం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల శని, ఆదివారం పిడుగులతో కూరిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
Ap Weather Report: ఏపీలో వింత వాతావరణం.. అక్కడ ఎండలు ..ఇక్కడ వానలు!
ఏపీలో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కనిపిస్తోంది. సాయంత్రానికి వాతావరణం మారిపోయి దట్టమైన మేఘాలతో చల్లగా ఉంటోంది. అయితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
Ap Weather Alert: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
ఏపీలో నేడు పలు చోట్ల వర్షం పడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.శ్రీకాకుళం -6, విజయనగరం -6, పార్వతీపురంమన్యం -10, అల్లూరి సీతారామరాజు -3, తూర్పుగోదావరి కోరుకొండ 26 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నాయి.
Ap-Tg Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త...ఠారెత్తిస్తున్న ఎండలు!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. కోస్తాలో వేడిగాలులు సెగలు పుట్టిస్తున్నాయి.ప్రకాశం జిల్లా ,కడప,నంద్యాల,తిరుపతి, శ్రీకాకుళం వరకు మొత్తం 223 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.