/rtv/media/media_files/2025/02/16/6uvteTUuHgGFZjBeBLT8.jpg)
musk trump Photograph: (trump)
ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీకి ప్రపంచ కుబేరుడు మస్క్ సారిథిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ట్రంప్ క్యాబినేట్ సమావేశం నిర్వహించగా.. అందులో పాల్గొన్న మస్క్ షాకింగ్ నోట్ ఒకటి రాశారు. ముఖ్యంగా టాప్ సీక్రెట్ అని తన నోట్ ప్యాడ్‌పై రాసి పెట్టుకున్నట్లు సమాచారం. ఇది కాస్తా మీడియా కంట్లో పడగా క్లిక్ మనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Also Read: Trump: కేవలం 30 రోజులే..అమెరికాను విడిచి వెళ్లిపోండి...!
అయితే అలా ఎందుకు రాశారని మస్క్‌ను అడగ్గా.. షాకింగ్ రిప్లై ఒకటి ఇచ్చారు. అసలు ఆయన ఏమని రిప్లై ఇచ్చారు. ఆయన ఎందుకు అలారాశారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ వ్యయాలను తగ్గించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీని ఏర్పాటు చేసి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను అధినేతగా ప్రకటించారు. అయితే ఈ శాఖ ఇచ్చిన సలహాలతో అమెరికాలోని అనేక మంది ఫెడరల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు.
Also Read: Holiday: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఈ వారంలోనే రెండు సెలవులు!
— Elon Musk (@elonmusk) April 12, 2025
ఇలా పెద్ద మొత్తంలో వ్యయాన్ని తగ్గించగల్గారు. దీంతో తమ ఉద్యోగాలు పోవడానికి మస్క్ కారణం అంటూ అనేక మంది ఆయనపై విమర్శలు చేశారు. ఆయనకు సంబంధించిన టెస్లా కంపెనీలపై దాడులకు తెగబడ్డారు. టెస్లాను బహిష్కరించాలని కోరుతూనే.. మరోవైపు ఆ కార్లను తగులబెట్టారు. ఇంత వ్యతిరేకతగా వస్తుండగా.. ఆయన్ను ట్రంప్ పదవి లోంచి తొలగించబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే అవి నిజమేనని తెలుస్తోంది. ముఖ్యంగా మస్క్ పదవీ కాలం వచ్చే నెలతోనే ముగియబోతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. తాజాగా ట్రంప్ క్యాబినేట్ సమావేశం నిర్వహించారు. అయితే ఆ మీటింగ్‌కు వెళ్లిన మస్క్.. మీడియా కళ్లన్నీ తనవైపుకు తిప్పుకున్నారు. అధికారులు అంతా చర్చిస్తుండగా.. మస్క్ మాత్రం తన వద్ద ఉన్న నోట్ ప్యాగ్‌పై టాప్ సీక్రెట్ అని రాసి పెట్టారు. దాన్ని గుర్తించిన మీడియా ప్రతినిధులు ఫొటోలు తీయగా.. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇది చూసిన ప్రతీ ఒక్కరూ.. దానికి అర్థం ఏంటని అడుగుతున్నారు. కొందరు అయితే కావాలనే మస్క్ ఇలా చేశారని, ఆయన ఎప్పుడూ మీడియాను ఆడుకుంటూ ఉంటారని కామెంట్లు పెడుతున్నారు. అయితే తాజాగా మస్క్ దీనిపై స్పందించారు. దీన్ని రీపోస్ట్ చేస్తూ.. నవ్వుతున్న ఎమోజీని పెట్టారు. అసలు ఆయన అలా ఎందుకు రాసి పెట్టుకున్నారు, టాప్ సీక్రెట్ అంటే అర్థం ఏంటా అని చాలా మంది ఆలోచిస్తున్నారు.
Also Read: Tv Offers: వారెవ్వా ఆఫర్లు కుమ్మేశాయ్.. 40 ఇంచుల స్మార్ట్‌టీవీలు కేవలం రూ.15వేల లోపే!
elon-musk | doze | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | cabinate | america cabinate