Holiday: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఈ వారంలోనే రెండు సెలవులు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త ఒకటి ప్రభుత్వాలు ప్రకటించాయి. సోమవారం మాత్రమే కాకుండా..ఈ వారంలోనే గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా మరో సెలవు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

New Update
Telangana and Andhra Pradesh School Holiday

Telangana and Andhra Pradesh School Holiday Photograph: (Telangana and Andhra Pradesh School Holiday)

విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త. సోమవారం ఏప్రిల్‌ 14న రెండు  రాష్ట్రాల్లోని  విద్యాసంస్థలకు సెలవు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఏప్రిల్ 14వ న సెలవు దినంగా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే.. శనివారం రెండో శనివారం, ఆదివారాలు సెలవులు కావడంతో.. సోమవారం కూడా హాలిడే కావడంతో విద్యార్థులు ఆనందంగా ఉన్నారు. అంబేద్కర్ జయంతిని జాతీయ సెలవు దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో విద్యాసంస్థలకు సెలవు వచ్చింది.

Also Read: Trump: కేవలం 30 రోజులే..అమెరికాను విడిచి వెళ్లిపోండి...!

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలు తమ క్యాలెండర్లలో ఏప్రిల్ 14వ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా చేర్చాయి. దీంతో పాఠశాలలు, కళాశాలలు సెలవు దినంగా ప్రకటించాయి. స్కూళ్లు, కాలేజీలతో పాటు.. దేశవ్యాప్తంగా బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు కూడా సోమవారం పనిచేయవు.

Also Read:  గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక సంస్థలు, విద్యా సంస్థలు ఆయన జీవితం, ఆయన చేసిన కృషి గురించి ప్రజలకు తెలియజేసేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి.సోమవారం రోజున మాత్రమే కాకుండా.. ఈ వారంలోనే మరో సెలవు కూడా ఉంది. ఏప్రిల్ 18వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా పాఠశాలలకు సెలవు అనే విషయం తెలిసిందే. వరుసగా వస్తున్న సెలవులతో విద్యార్థులకు ఎగిరిగంతేస్తున్నారు. కాగా.. ఇప్పటికే పలు పాఠశాలల్లో పరీక్షలు పూర్తవగా.. ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నారు. ఇందులోనూ సెలవులు రావటంతో.. విద్యార్థులు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచే ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23, 2025 విద్యా సంవత్సరానికి చివరి పనిదినం. చాలా పాఠశాలలు అదే రోజు ఫలితాలను ప్రకటిస్తాయి మరియు తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. మళ్లీ జూన్ 11తో వేసవి సెలవులు పూర్తయి జూన్ 12వ తేదీన పాఠశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే, జూనియర్ కళాశాలలకు మాత్రం మార్చి 31 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నట్లు అధికారులు ప్రకటించారు. జూన్ 2న తిరిగి తరగతులు ప్రారంభమవుతాయి.

Also Read: VIRAL VIDEO: మూడే మూడు పెగ్గులు.. సైకిల్‌తో రోడ్‌రోలర్‌ను ఈడ్చుకుంటూ- రయ్ రయ్

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

 telangana | school | holiday | bank-holiday | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news update

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు