ap: హమ్మయ్యా ఆంధ్ర రొయ్య అమెరికాకు.. కాకపోతే..!

ట్రంప్ సుంకాలను వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు ఊరట లభించింది. నిలిచిపోయిన రొయ్యల కంటైనర్లు అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. రైతులు ధరలు పెంచాలని కోరుతున్నారు.

New Update
prawns

prawns

ట్రంప్ మావ దెబ్బకు అల్లాడిపోయిన రొయ్యల రైతులకు మళ్లీ మంచిరోజులు వచ్చినట్లు కనపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెంచిన సుంకాల అమలును వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు మళ్లీ ఊపిరి వచ్చినట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు నిలిచిపోయిన రొయ్యల కంటైనర్లు మళ్లీ అమెరికాకు బయలుదేరడానికి రెడీ అవుతున్నాయి. దీంతో గోదాముల్లో నిల్వలు తగ్గుతున్నాయి. అయితే సుంకానికి ముందు ఉన్న ధరలు రైతులకు మాత్రం దక్కడం లేదని.. ధరలు పెంచాలని రైతులు కోరుతున్నారు. 

Also Read:America Earth Quake: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం

ఈ విషయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆక్వా సలహా కమిటీ సమావేశం జరిగింది. ధరల విషయంలో వ్యాపారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటోంది ప్రభుత్వం. ట్రంప్ సుంకాలు పెంచే నిర్ణయాన్ని వాయిదా వేయడంతో రొయ్యల ఎగుమతులు మళ్లీ ప్రారంభమయ్యాయంటున్నారు రైతులు. చాలా కంటైనర్లు సముద్ర మార్గం ద్వారా వెళ్లడానికి సిద్ధమయ్యాయి అంటున్నారు. ఒకప్పుడు 100 కౌంట్ రొయ్యల ధర రూ. 240 ఉంటే.. ఇప్పుడు అది రూ.230కి తగ్గింది. అదే 30 కౌంట్ రొయ్యల ధరలో కూడా తేడా కనపడుతుంది. గతంలో కిలో రూ.470 ఉంటే.. ఇప్పుడు రూ.420 నుంచి రూ.430 మాత్రమే ఉంది. దీంతో ఆక్వా రైతులు ధరలు పెంచమని అడుగుతున్నారు.

Also Read: Bangladesh: నిప్పుతో గేమ్స్‌ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్

సుంకాల ప్రకటనకు ముందు కొనుగులు చేసిన రొయ్యలు కూడా ఇంకా గోడౌన్‌లలోనే ఉన్నట్లు సమాచారం. సుంకాల అమలుకు 90 రోజుల గడువు రావడంతో వాటిని అమెరికాకు ఎగుమతి చేయడానికి వ్యాపారులు సిద్ధమయ్యారు . దాదాపు 30 వేల నుంచి 40 వేల టన్నుల రొయ్యలు అంటే 3 వేల నుంచి 4 వేల కంటైనర్ల సరుకు ఉన్నట్లు తెలుస్తుంది. ఎగుమతులు ప్రారంభం కావడంతో రొయ్యల కొనుగోలు ఊపందుకోగా.. సోమవారం మధ్యాహ్నం రొయ్యల ధరలు కొద్దిగా పెరిగినట్లు సమాచారం. 30 కౌంట్ రొయ్యల ధర ఉదయం కిలో రూ.420 ఉండగా.. మధ్యాహ్నం రూ.10 పెరిగి రూ.430 అయ్యింది. 

25 కౌంట్ రొయ్యల ధర కిలో రూ.470 నుంచి రూ.500కి చేరింది. చిన్న రొయ్యల ధర కూడా కిలోకు రూ.5-10 పెరిగింది అంటున్నారు.ఏపీ ప్రభుత్వం రొయ్యల ధరలపై ఏర్పాటు చేసిన ఆక్వా సలహా కమిటీ  వర్చువల్ సమావేశమైంది. ఈ మేరకు అప్సడా వైస్ ఛైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎగుమతిదారులు, రైతులు పాల్గొన్నారు. రైతులు రొయ్యలకు ధర పెంచాలని ప్రధానంగా కోరారు.. దీనికి అయితే ఇప్పటికిప్పుడు ధరలు నిర్ణయించలేమని వ్యాపారులు అన్నారు. 

ట్రేడర్లే రైతుల నుంచి కొనుగోలు చేసినా.. చివరకు రొయ్యలు వ్యాపారులకే చేరుతాయని రైతులు, ప్రజా ప్రతినిధులు అంటున్నారు. వ్యాపారులు నిర్ణయించిన ధరకే ట్రేడర్లు కూడా కొంటారని.. ప్రతి 15 రోజులకోసారి ధరలు ప్రకటించాలంటున్నారు రైతులు. మిగిలిన వ్యాపారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని.. ఇప్పుడే తాము ధరలు చెప్పలేమని ఎగుమతిదారుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. 

Also Read:  Ap Weather Alert: ఏపీలో వచ్చే మూడు రోజులు పిడుగులు,మెరుపులతో వానలు..!

Also Read: America-South Korea: అమెరికా పొమ్మంటుంది... దక్షిణ కొరియా రమ్మంటోంది!

 trump | India Tariffs | tariff tax | trump tariff announcement | donald trump tariffs | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | international-news | international news in telugu | international news telugu | latest-international-news | ap telugu news | west-godavari 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు