/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)
Rains
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఓ ముఖ్యమైన ప్రకటన చేసింది. 7 రోజులపాటూ.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.అయితే.. వర్షాలతోపాటూ.. ఉరుములు, మెరుపులు కూడా వస్తాయని వివరించింది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని..కొన్నిసార్లు 50 కిలోమీటర్లకు కూడా పెరుగుతుందని తెలిపింది.
మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా 7 రోజుల వర్ష సూచన ఉంది.మంగళవారం ఉదయం తెలంగాణపై మేఘాలు వచ్చే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత కల్వకుర్తి, వరంగల్ ప్రాంతంలో చినుకులు పడే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం 4 తర్వాత అవి అంతకంతకూ పెరుగుతూ.. హైదరాబాద్‌లో కూడా జల్లులు పడే ఛాన్సులు ఉన్నాయి. సాయంత్రం 5 తర్వాత మహబూబ్ నగర్, హైదరాబాద్, మెదక్, తూప్రాన్‌లో వాన పడుతుంది.
Also Read : ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !
Ap-Telangana Rain Alert
సాయంత్రం 7 తర్వాత వాన పడదు. మేఘాలు మాత్రం అర్థరాత్రి వరకూ ఉంటాయి.ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 వరకూ విపరీతమైన ఎండ ఉంటుంది. మేఘాలు కూడా పెద్దగా ఉండవు. మధ్యాహ్నం 1 తర్వాత విశాఖపట్నంలో వాన మొదలవుతుంది. సాయంత్రం 6 గంటల వరకూ చిన్న పాటి చినుకులు ఉత్తరాంధ్రలో కురిసే అవకాశాలు కనపడుతున్నాయి. రాత్రి 7 తర్వాత ఇక వాన ఉండదు. ఉత్తరాంధ్రలో అర్థరాత్రివరకూ మేఘాలు ఉంటాయి. మిగతా ప్రాంతాల్లో మాత్రం మేఘాలు కూడా ఉండవు. భగ్గుమనే ఎండలు ఉంటాయి. రాత్రివేళ కూడా వేడిగానే ఉంటుంది.గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 19 కిలోమీటర్లు ఉంది. గాలి మొత్తం బంగ్లాదేశ్ వైపు పరుగులు పెడుతోంది. ఏపీలో గంటకు 13 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 9కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి.
Also Read : కేవలం రూ.300 వందలకే ఇంటింటికీ ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!
వాన పడే సమయంలో గాలి వేగం పెరుగుతుంది. ఇవాళ ప్రయాణాలు చేసేవారికి గాలి బాగా తగులుతుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఎండ పెద్ద సమస్య. జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.ఉష్ణోగ్రత చూస్తే.. ఏపీలో 37 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉండనున్నట్లు తెలుస్తుంది. రాయలసీమ మొత్తం నిప్పు కణికలా ఉంటుంది. నెల్లూరు, ఒంగోలు, గుంటూరు వరకూ తీవ్రమైన ఎండలు ఉంటాయి. తెలంగాణలో దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ భగ్గుమంటాయి. అక్కడ ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్య తెలంగాణలో 37 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.
Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!
ఇవాళ రామగుండం, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రజలు ఎంత నీరు తాగినా, దాహం తీరదు.తేమ రెండు రాష్ట్రాల్లో 30 శాతమే ఉంది. రాత్రికి తేమ తెలంగాణలో 60 శాతం, ఏపీలో 80 శాతానికి పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ దాని వల్ల వాన పడే పరిస్థితి లేదు. మొత్తంగా ఇవాళ వర్షాల కంటే ఎండలే ఎక్కువగా ఉంటాయి. ప్రజలు వీలైనంతవరకూ నీడలో ఉండాలి. ఎండలో పనులు లేకుండా చూసుకోవాలి.
Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?
ap | telangana | rains | weather | Andhra Pradesh and Telangana Weather Report | telangana-weather-update | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates