AP: విశాఖలో టీసీఎస్ భారీ క్యాంపస్..99పైసలకే భూమి లీజు

ఏపీలో క్యాంపస్ పెట్టడానికి అతి పెద్ద టెక్ కంపెనీ ముందు వచ్చింది. మంత్ర లోకేశ్ చొరవతో విశాఖలో టీసీఎస్ రూ.1, 370 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. దీంతో విభజన తర్వాత ఏపీలో పెట్టబోతున్న అతిపెద్ద టెక్ సంస్థగా టీసీఎస్ నిలవనుంది. 

New Update
Ap

TCS campus In Vizag

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. విశాఖ ఐటీ హబ్ గా మారనుంది. దీనికి మొదటి మెట్టుగా టీసీఎస్ నిలవబోతోంది. విశాఖలో రూ. 1370 కోట్ల పెట్టుబడితో అతి పెద్ద క్యాంపస్ ను నెలకొల్పేందుకు టాటా కన్సెల్టెన్సీ సర్వీస్ రెడీ అయింది. టీసీఎస్ ఇక్కడకు రావడానికి మంత్రి లోకేశ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. లోకేశ్ స్వయంగా వెళ్ళి టీసీఎస్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తో మాట్లాడి ఒప్పించారని చెబుతున్నారు. దీని ద్వారా సుమారు 12 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. 

Also Read :  ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం

99 పైసలకే లీజు..

టీసీఎస్ కంపెనీ కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తాజాగా సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. విశాఖపట్నంలో  ఏకంగా 21.16 ఎకరాల భూమిని నామమాత్రపు ధర, అంటే కేవలం 99 పైసలకే (టోకెన్ ధర) కేటాయించేందుకు నిర్ణయించింది. అంటే ఏడాదికి 99 పైసలు లీజు కింద తీసుకుంటారన్నమాట. గుజరాత్ లో ప్రధాని మోదీ సీఎంగా ఉన్నప్పుడు టాటా మోటార్స్ కు ఇలాగే 99 పైసలకు భూమిని కేటాయించారు. దాన్నే ఆదర్శంగా తీసుకున్న సీఎం చంద్రబాబు...అదే విధానాన్ని ఇప్పుడు విశాఖలో కూడా అమలు చేస్తున్నారు. టీసీఎస్ రావడం వలన ఏపీలో ఐటీ విప్లవం మొదలవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. 

Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Also Read :  త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి వైష్ణవి.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్

Also Read: Encounter: ఛత్తీస్ ఘడ్ లోమళ్ళీ ఎన్ కౌంటర్..అగ్రనేతలు హతం

 

ap cm chandra babu naidu | today-latest-news-in-telugu | andhra-pradesh-news | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు