/rtv/media/media_files/2025/04/15/60cjjtMW4ZwiK2ZsFCHh.jpg)
actress Vaishnavi engagement
Actress Vaishnavi: ప్రముఖ కన్నడ నటి, బుల్లితెర ఫేమ్ వైష్ణవి గౌడ త్వరలో వివాహ బంధానికి నాంది పలకబోతున్నారు. ఈరోజు తన ప్రియుడు అనుకూల్ మిశ్రాతో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వైష్ణవి ఇన్ స్టాగ్రామ్ లో ఎంగేజ్మెంట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో అభిమానులు, బుల్లితెర సెలెబ్రెటీలు ఆమెకు విషెష్ తెలియజేస్తున్నారు. ఈ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సెలెబ్రెటీలు హాజరయ్యారు. కన్నడ నటి అమూల్య గౌడ, ప్రెజెంబర్ చైత్ర వాసుదేవన్, పూజా లోకేష్, రీతూ సింగ్, జ్యోతి కిరణ్ తదితరులు నిశ్చితార్ధ వేడుకలో సందడి చేశారు.
Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
ఎంగేజ్మెంట్ వేడుక కోసం వైష్ణవి ఫుల్లీ ఎంబ్రాయిడర్డ్ క్రీమ్ కలర్ లెహంగా ధరించింది. పచ్చ రాళ్ళ చోకర్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మాంగ్ టీకాతో అందంగా ముస్తాబైంది. మరోవైపు వరుడు అనుకూల్ మిశ్రా ఐవరీ షేర్వానీ ధరించి రాయల్ లుక్‌లో
Also Read : Allu Arjun ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్లతో బన్నీ.. అట్లీ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
అగ్నిసాక్షి సీరియల్
వైష్ణవి ' సీతారామ', అగ్నిసాక్షి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా దగ్గరైంది. గత పదేళ్లకు పైగా టీవీ పరిశ్రమలో రాణిస్తోంది. మొదటగా 'దేవి' అనే సీరియల్ చేసింది. అందులో టైటిల్ రోల్లో మెప్పించిన వైష్ణవి వరుస ఆఫర్లు దక్కించుకుంది. కన్నడ బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది.
telugu-news | cinema-news | latest-news